Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాడిసన్ డ్రగ్స్ కేసు: నేడు విచారణకు హాజరు కాలేనన్న డైరెక్టర్ క్రిష్!!

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించైనా విషయం తెలిసిందే. ఇది టాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ కీలక నేత యోగానంద్ తనయుడు వివేకానంద పోలీసులకు పట్టిబడిన విషయం తెలిసిందే.

అయితే ఈ డ్రగ్స్ పార్టీలో సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్టు మాదాపూర్ డిసిపి వినీత్ కుమార్ వెల్లడించారు. అయితే ఆయన కొకైన్ తీసుకున్నారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉన్న క్రిష్ ను విచారణకు పిలిచాము అని, ఆయనకు వైద్య పరీక్షలు చేస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.

Radisson drugs case: Director Krish informed police that he would not attend the inquiry today!!

ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ను విచారణకు రావాలని పోలీసులు ఆయనకు ఫోన్ కాల్ చేసి చెప్పారు. ఇదిలా ఉంటే రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వ్యవహారంలో తాను విచారణకు సహకరిస్తానని చెబుతూనే, డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని, మరో రెండు రోజులు తనకు సమయం కావాలని కోరారు.

శుక్రవారం నాడు వ్యక్తిగతంగా తాను విచారణకు హాజరవుతానని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. డైరెక్టర్ క్రిష్ తో పాటు సెలబ్రిటీలు శ్వేత, నీల్, సినీనటి లిషి, రఘు చరణ్, సందీప్ తదితరులు ఉన్నారు. ఇక వీరందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్ లో ప్రముఖుల చిట్టా ఉందని, పలువురు అతనితో చాటింగ్ చేశారని గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఉన్న వారందరినీ విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+