అజరుద్దీన్ కోసం ఆటోలో రాహుల్ గాంధీ: చిరుద్యోగులకు హామీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. పోలింగ్‌కు ఇంకో రెండు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.
30వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

చివరి రోజు కావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ.. హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సాయంత్రం ప్రచారానికి తెర పడేలోగా ఆయన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో మొదటిది- జూబ్లీహిల్స్ నియోజకవర్గం.
ఇక్కడ టీమిండియా మాజీ కేప్టెన్ అజరుద్దీన్.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్నారు. ఈ ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అజరుద్దీన్‌తో కలిసి తొలుత ఆటో డ్రైవర్లు, చిరుద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఉద్యోగులను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

తమ ఉద్యోగాలకు ఎలాంటి భరోసా ఉండట్లేదని, విధి నిర్వహణలో భాగంగా ఒకరోజులో కనీసం 12 నుంచి 14 గంటల పాటు తాము రోడ్ల మీదే ఉండాల్సి వస్తోందని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఉద్యోగులు వాపోయారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, తమ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.
తమకు వస్తోన్న జీతం ఏ మాత్రం చాలట్లేదని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. తనకు ప్రతినెలా 13,000 నుంచి 14,000 రూపాయల వరకు వేతనం అందుతోందని, చాలీచాలని ఈ జీతంతో కుటుంబ పోషణ కష్టమైందంటూ ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
GHMC సిబ్బందితో రాహుల్ గాంధీ మాటా మంతి..!#RahulGandhi #GHMC #Hyderabad #TelanganaCongress #TelanganaElections2023 #TelanganaElection2023 #Telangana #Oneindaitelugu pic.twitter.com/Slv3d9HdJj
— oneindiatelugu (@oneindiatelugu) November 28, 2023
దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చిరుద్యోగుల కోసం ఖచ్చితంగా మంచి నిర్ణయాలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో నుంచి వచ్చే సూచనలతో సంక్షేమ పథకాలను రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ, అజరుద్దీన్.. ఆటోలో ప్రయాణించారు.












Click it and Unblock the Notifications