తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు: 20న వరంగల్‌లో సభ..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 20న ఆయన వరంగల్‌లో పర్యటించనున్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 20న ఆయన వరంగల్‌లో పర్యటించనున్నారు.
ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ లో ఏర్పాటు చేసే సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభకు దళిత, బీసీ, గిరిజన సభగా పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి ఈ సభను తొలుత మహబూబాబాద్ ప్రాంతంలో నిర్వహించాలని భావించినప్పటికీ వరంగలే సరైన వేదిక అని భావించినట్టు తెలుస్తోంది.టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని చాటి చెప్పడమే ధ్యేయంగా ఈ సభను నిర్వహించనున్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత, బీసీ, గిరిజనులను తమవైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతోనే సభకు ఆ పేరు ఖరారు చేశారు. రేవంత్ రెడ్డి చేరిక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఇదే కావడం ప్రత్యేకతను సంతరించుకుంది.అలాగే రాహుల్-రేవంత్ ఒకే వేదికపై టీఆర్ఎస్ మీద విరుచుకుపడే సందర్భం రావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications