హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ రాక.. గ్రేటర్లో కాంగ్రెస్‌కు పరాభవం! ఓటమి ముందే గుర్తించిన దానం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల నుంచి 2 స్థానాలకు పడిపోయింది. 2009లో 52 స్థానాలు గెలిచిన ఆ పార్టీ, ఇప్పుడు కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ మరీ ఇంత పరాభవం కావడానికి పలు కారణాలుగా అంతర్గతంగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం సమయంలో సిఎల్పీ నేత జానా రెడ్డి రూ.5 భోజనం తెప్పించుకొని తినడం, దానిని పొగడటం బాగా నష్టపరిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమయ్యామని, అలాగే కెసిఆర్ ఏం చేయకపోయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతారనే ఉద్దేశ్యంతో ప్రజలు ఓట్లు వేసినట్లుగా భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు.

హెచ్‌సియులో వేముల రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ బాగా రాజకీయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడులో ముగ్గురు విద్యార్థులను చనిపోతే పట్టించుకోని రాహుల్ గాంధీ, హెచ్‌సియుకు మాత్రం ఏకంగా పది రోజుల్లోనే రెండుసార్లు వచ్చారు.

కచ్చితంగా గ్రేటర్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోనే ఆయన ఒకటికి రెండుసార్లు వచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్ రాక... అది గ్రేటర్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావించింది. కానీ మరోసారి రాహుల్ గాంధీ అడుగుపెడితే ఓటమి తప్పదని తేలిందనే మాటలు వినిపిస్తున్నాయి.

రాహుల్ గాంధీ, జానా రెడ్డి

రాహుల్ గాంధీ, జానా రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల నుంచి 2 స్థానాలకు పడిపోయింది. 2009లో 52 స్థానాలు గెలిచిన ఆ పార్టీ, ఇప్పుడు కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.

దానం నాగేందర్

దానం నాగేందర్

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్‌ ప్రకటించారు.

దానం నాగేందర్

దానం నాగేందర్

శనివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పంపానని చెప్పారు. ఇకపై సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానన్నారు.

 దానం నాగేందర్

దానం నాగేందర్

నగర అధ్యక్షుడిగా ఉన్న తనకు ఈ ఎన్నికల్లో నగరం మొత్తంలో పనిచేసేందుకు పార్టీ పూర్తి బాధ్యతలు ఇవ్వకపోయినా కాంగ్రెస్‌ గెలుపు కోసం కష్టపడి పని చేశానని, అయినా మేం చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించలేదని, టిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు ఆదరించారన్నారు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో తెరాస గెలుపొందిందన్నారు.

 దానం నాగేందర్

దానం నాగేందర్

కాంగ్రెస్‌ ఓటమికి గ్రూపు రాజకీయాలు కూడా కారణమయ్యాయన్నారు. ఎన్నికల్లో తెరాస దూసుకుపోతోంటే కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు విభేదాలు కనిపించాయని, గ్రూపుల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అప్పుడే చెప్పామని, ఇప్పటికైనా గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలన్నారు.

 దానం నాగేందర్

దానం నాగేందర్

ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, మైనారిటీలను కాంగ్రెస్‌ దూరం చేసుకుంటోందని, ఈ విషయాన్ని పార్టీ అగ్రనాయకులకు కూడా చెప్పామని, కాంగ్రెస్‌ పార్టీ ఈ వర్గాల్లో విశ్వసనీయత కోల్పోతోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులంతా ఓడిపోతున్న విషయాన్ని తాను ఈ నెల 2వ తేదీనే గుర్తించి ధైర్యంగా ఉండండని అభ్యర్థులకు చెప్పానన్నారు.

 దానం నాగేందర్

దానం నాగేందర్

నగర ప్రజలు తెలివిగా ఓటు వేశారన్నారు. ఇతర పార్టీలు గెలవడం కంటే టిఆర్ఎస్ గెలిస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని భావించారని, కేసీఆర్‌, కేటీఆర్‌ల ప్రచారం ప్రజలను ఆకట్టుకుందని, కేటీఆర్‌ అన్ని వర్గాలనూ ఆకర్షించేలా ప్రచారం చేశారని కితాబు ఇచ్చారు.

English summary
Rahul Gandhi in UoH protest, Congress win only 2 seats GHMC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X