హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెచ్‌సీయూకు రాహుల్ గాంధీ: రోహిత్ ఆత్మహత్యకు ముందు రోజు ఏం జరిగింది?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియూ)లో పిహెచ్‌డి స్కాలర్ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ రాత్రి విద్యార్ధి సంఘాల నేతలతో గొడవ పడిన ఓ వీడియో మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయలేదంటే..: రోహిత్ ఆత్మహత్యపై వైస్ ఛాన్స్‌లర్

ఈ వీడియోలో ఏబీవీపీ బ్యానర్ కనిపించినందుకే చించానని రోహిత్ అందులో చెబుతున్నట్లుగా ఉంది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న బ్యానర్‌ను నీకు నచ్చలేదని చించుతావా? అంటూ విద్యార్ధి సంఘాల నేతలు రోహిత్‌తో వాగ్వాదానికి దిగారు. మీ ఇంట్లో చీరలు కూడా ఇంతే చించుతావా అంటూ ఏబీవీపీ నేతలు రోహిత్‌ను నిలదీశారు.

రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ రోజు రాత్రి రోహిత్‌తో విద్యార్ధి సంఘాల నేతలు వాగ్వాదం చేసుకున్న వీడియో మంగళవారం మీడియాలో హల్‌చల్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రోహిత్ ఏబీవీపీ విద్యార్ధి సంఘాల నేతలతో వాగ్వాదానికి దిగారు.

Rahul Gandhi to visit Central University, Hyderabad

అయితే ఈ విషయం తెలిసిన వీసీ అప్పారావు విద్యార్ధి సంఘాల నేతల మధ్య సమస్యసలను సామరస్యంగా పరిష్కరించక పోవడం వల్లనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని యూనివర్సిటీ విద్యార్ధులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌‌కు చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటారు. పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటనకు గల కారణాలపై విద్యార్ధులతో మాట్లాడతారు.

వర్శిటీలోనే ఉంటానని రోహిత్ తల్లి: పరిశోధక విద్యార్థి సూసైడ్ నోట్ ఇదీ..వర్శిటీలోనే ఉంటానని రోహిత్ తల్లి: పరిశోధక విద్యార్థి సూసైడ్ నోట్ ఇదీ..

మరోవైపు హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్‌సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని, అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని జేఏసీ నాయకులు తెలిపారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్‌డీ విద్యార్థి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
Congress VP Rahul Gandhi will visit Hyderabad Central University today and meet the family of the Dalit Ph. D student who committed suicide on Sunday. The suicide of Rohith Vemula has triggered protests from students even as Union Labour Minister Bandaru Dattatreya and the VC were named in an FIR in this regard.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X