
వెయ్యి కిలో మీటర్లు పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర.!బళ్లారిలో శనివారం కాంగ్రెస్ భారీ విజయోత్సవ సభ.!
బళ్లారి/హైదరాబాద్ : సమైఖ్య భారతావని కోసం రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో యాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. భారత దేశ చరిత్రలో ఓ భారతీయుడు కాలినడకన జాతి సమైక్యత కోసం చేస్తున్న అతి పొడవైన కవాతుగా ఈ యాత్ర చరిత్రలో లిఖించబోతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. సెప్టెంబర్ 7, 2022న భారత ఉపఖండంలోని దక్షిణ కొనగా ఉన్న కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ సుదీర్ఘ యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక మీదుగా శనివారంతో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవటం నభూతో అన్నట్లుగా కొనసాగుతుందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. 3500 కిలోమీటర్ల మేరకు కాశ్మీర్ వరకు కొనసాగనున్న ఈ రాహుల్ గాంధి కవాతు కాంగ్రెస్‌తో పాటు యావత్ దేశానికి ఒక చారిత్రాత్మక సంఘటన మారబోతుందంటున్నారు పార్టీ పెద్దలు.
లక్షల గొంతుకలు.. వెయ్యి కిలోమీటర్లు.. జోష్ లో జోడో యాత్ర.. 1000కిమీ పూర్తి..
దేశ స్వాతంత్య్రం కోసం జాతిపిత మహాత్మా గాంధీ దండి మార్చ్ పేరుతో గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు కాలినడకన 24 రోజుల్లో 389 కిలోమీటర్లు చేసిన సుదీర్ఘమైన కవాతు ఓ చరిత్ర సృష్టిస్తే, జాతి సమైక్యతను సంఘటితం చేస్తూ రాహుల్ గాంధి చేస్తున్న భారత్ జోడో యాత్ర మరో చరిత్రకు నాంది పలకబోతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కర్నాటక నుండి ఆంద్రప్రదేశ్ లో ప్రవేశించిన ఈ యాత్ర బళ్లారి జిల్లాలో శనివారం నాటికి ఈ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుంది. దీంతో బళ్లారిలో కాంగ్రెస్ నాయకత్వం భారీ విజయోత్సవ సభను ఐదు లక్షల మందితో నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

చరిత్ర సృష్టించిన యాత్ర.. జనజాతరగా రాహుల్ జోడో
యాత్ర వెయ్యి కిలోమీటర్ల కొనసాగటం అంతాఆశామాషికాదంటున్నారు పార్టీ నాయకులు. అందులో గాంధి కుటుంభం నుండి రాహుల్ గాంధీ అలుపెరగని యోధునిగా కాలమాన, వాతావరణ, బౌగోళిక పరిస్థితులను వంట పట్టించుకుని ముందుకు సాగుతుండటం యావత్ జాతిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. రాహుల్ గాంధీను అనుసరిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాస్థాయి, జాతీయస్థాయి నేతలు, ఐఎన్సీ కమిటీలు, కార్యకర్తలు, సహాయ సిబ్బంద కార్యకర్తలు మరియు సహాయక సిబ్బందితో సహా పలువురు మార్గంలో ఆయన మానసిక పరిపక్వతను, ఆయన ప్రదర్శిస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. రాత్రి విశ్రాంతి తర్వాత తిరిగి ప్రారంభించే వరకు గడిచిన 1000 కిలోమీటర్ల యాత్రలో ఆయన అనుసరించిన దినచర్య వేలాది, లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తుందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.

ఐదు లక్షలమందితో భారీ సభ.. శనివారం బళ్లారిలో భారీ విజయోత్సవసభ..
తెల్లవారుజామునే నిద్ర లేవగానే 20 నిమిషాల వ్యాయామం, ఉదయం తేలికపాటి అల్పాహారం యాత్రలో ముందడుగు రోజంతా 25 కిలోమీటర్ల మేరకు నడకలో ఉష్ణోగ్రతల మార్పులు, దక్షినాది రాష్ట్రాలలో ఎండ, వడగాల్పులు, అడపాదడపా చిరు జల్లులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగటం రాహుల్ గాంధికే సాధ్యమవుతుంది. ఈ చారిత్రక భారత్ జోడో యాత్రలో లక్షలాదిగా తరలి వస్తున్న సామాన్య వర్గాల ప్రజలు కూడా కాలినడకన కవాతుగా పాల్గొనడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తమిళనాడులో జరిగిన యాత్రలో లక్ష మందికి పైగా రాహుల్ గాంధితో పాదం కలిపారు. కేరళలో దాదాపు 1.25 లక్షలు, కర్ణాటకలో శుక్రవారం వరకు దాదాపు 1.50 లక్షల యాత్రలో పాల్గొనగా... ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే సరికి దాదాపు 2 లక్షల మంది పాల్గొనటం చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్య నేతలు అంటున్నారు.

ఇది చరిత్ర.. రాహుల్ నిబద్దతకు నిదర్శనమంటున్న నేతలు ఇక రాహుల్ యాత్ర ఈ నెల 23న తెలంగాణాలోని
నారాయణపేట్ నియోజకవర్గంలో ప్రవేశించి 375 కిలోమీటర్ల మేరకు 19 నియోజక వర్గాలను చుడుతూ పక్కనే ఉండే మరో 30 నియోజకవర్గాల కూడా యాత్రలో మమేకం చేస్తూ మొత్తానికి 50 నియోజకవర్గాలు కవర్ చేసేలా నవంబర్ 6న జుక్కల్ నియోజకవర్గంలో యాత్ర ముగియనుంది. ఇందులో దీపావళి పండుగను పురస్కరించుకుని 24, 25 తేదిల్లో రాహుల్ గాంధి విశ్రాంతి తీసుకోనుండగా, మరోసారి మునుగోడు ఎన్నికల రోజైన నవంబర్ 3న కూడా రాహుల్ విశ్రాంతి తీసుకోనున్నారు. ఇందుకు గాను తెలంగాణా పిసిసి 10 కమిటీలతో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తుంది. తెలంగాణాలో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ దక్షినాది రాష్ట్రాల్లో సాధించిన విజయం కంటే రాష్ట్రంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమవుతోంది. దీనికి సంబందించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీనియర్లతో సమావేశమై యాత్ర ఘనవిజయంపై పలు సూచనలు చేశారు.