సికింద్రాబాద్‌: కూలిన రైల్వే బ్రిడ్జి రేలింగ్: ఇద్దరికి గాయాలు, భారీ ట్రాఫిక్ జాం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆర్మీ వాహనం దూసుకెళ్లడంతో సికింద్రాబాద్ పేట్ సిటీలైట్ హోటల్ దగ్గర ఉన్న రైల్వే కమాన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కూలిన ఇనుప కమాన్‌ను అధికారులు భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. సికింద్రాబాద్ బైబిల్ హౌస్ దగ్గర రైల్వే బ్రిడ్జి రేలింగ్ కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

railway bridge railing collapses after hitting a military vehicle

ట్యాంక్ బండ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఇతర మార్గాల నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతంలో కావడం ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Traffic coming from Patny Junction towards Bible House is restricted and it is being diverted towards Parklane,Paradise due to accident at Bible House Railway bridge Secunderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి