చర్లపల్లి టు నాగపట్నం ప్రత్యేక రైళ్లు- రూట్..షెడ్యూల్, కోణార్క్ దారి మళ్లింపు..!!
దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. వేళాంగిణీ మేరీ మాత పండుగ రద్దీకి అనుగుణంగా చర్లపల్లి నుంచి తిరువారూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు షెడ్యూల్ తో పాటుగా రూట్ ను ప్రకటించారు. ఇక.. సికింద్రాబాద్ - గుంటూరు మధ్య మూడో రైలు మార్గం పనుల నిమిత్తం కాజీపేట మీదుగా నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను అక్టోబర్ లో దాదాపు అయిదు రోజులు రద్దు చేసారు. ఈ మార్గం మీదుగా ప్రయాణం సాగించే ప్రధాన రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వివరించారు.
వేళాంగిణీ మేరీ మాత పండుగ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తారు. దీంతో, రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. నంబర్ 07091 రైలు ఈ నెల 27, సెప్టెంబర్ 8న ఉదయం 8.10 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి 10.28 కి నడికూడి చేరుకుంటుంది. పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడీ, విల్లుపురం, చిదంబరం, నాగపట్టణం మీదుగా మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరువారూర్ చేరుకుంటుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో (07092) ఈ రైలు ఈ నెల 28, సెప్టెంబర్ 9వ తేదీల్లో తిరువారూర్ లో రాత్రి 10.35 కి బయల్దేరి రెండో రోజు సాయంత్రం తెనాలి, గుంటూరు మీదుగా రాత్రి 1.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది.

ఇక.. మూడో రైలు మార్గం నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు సికింద్రాబాద్ - గుంటూరు- సికింద్రాబాద్ (వయా వరంగల్, ఖాజీపేట) ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదే విధంగా గుంటూరు - సికింద్రాబాద్ గోల్కొండ ఎక్సెప్రెస్ అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకు గుంటూరు - కాజీపేట మధ్యన రద్దు చేసి.. ఖాజీపేట - సికింద్రాబాద్ మధ్య నడపనున్నారు. 17202 సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఖాజీపేట వరకే నడపనున్నారు. ఇక.. కోణార్క్, ఈస్ట్ కోస్ట్, సాయినగర్ షిర్డీ - కాకినాడ, విశాఖ- ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ లను గుంటూరు మీదుగా దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications