మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!!

రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు కొత్తగా మరో వందేభారత్ తో పాటుగా రెండు అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రూట్ తో పాటుగా షెడ్యూల్ ఖరారు అయింది. ఏపీ, తెలంగాణ మీదుగా ప్రస్తుతం ప్రయాణిస్తున్న వందేభారత్ తో సహా అమృత్ భారత్ రైళ్లు ఆదరణ పెరిగింది. వస్తున్న డిమాండ్ మేరకు మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు మార్గాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ కు ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణ.. డిమాండ్ మేరకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆమోదం పొంది పట్టాలెక్కని విజయవాడ - బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ పైన ఈ వారంలో అధికారికంగా నిర్ణయం రానుంది. ఇదే సమయంలో కొత్తగా సికింద్రాబాద్ నుంచి నాందేడ్ కు వందేభారత్ ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రెండు నగరాల మధ్య దూరం 280 కిమీ. కొత్తగా వందేభారత్ అందుబాటు లోకి రావటం ద్వారా కేవలం మూడు గంటల్లోనే నాందేడ్ చేరుకునే వెసులుబాటు కలగనుంది. ఇప్పటి వరకు సాధారణ రైళ్లు ఈ దూరాన్ని సుమారు 7 గంటల్లో చేరుకుంటున్నాయి. అదే విధంగా చర్లపల్లి - షాలీమార్, చర్లపల్లి - గోరఖ్ పూర్ మధ్య రెండు రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం అవుతున్నాయి. ఈ నెలాఖరులో ఈ రెండు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు స్పష్టత ఇచ్చారు.

railways-big-decision-over-another-vandebharat-from-secunderabad-two-amrut-bharat-service-from-cher

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో

ఈ కొత్త రైళ్లు ఇతర జోన్ల మీదుగా వాటిని నడపాల్సి ఉంది. రైలు వేళలు, నిర్వహణ పైన తుది కసరత్తు జరుగుతోంది. ఆ తరువాత అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నారు. కాగా.. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, యశ్వంత్ పూర్ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి ఆదరణ పెరుగుతోంది. అదే విధంగా సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ రైలు 575 కిలోమీటర్లను 7.15 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటికే ఉన్న ఈ వందే భారత్ రైళ్లతో పాటు సికింద్రాబాద్-నాందేడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలగనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విజయవాడ - బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ పైనా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. విశాఖ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ పైన పరిశీలన చేస్తున్నారు. ఈ రెండు రైళ్లల్లో ఒక సర్వీసు ప్రారంభం పైన నిర్ణయం వెల్లడించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+