వందేభారత్ రైళ్లు ఇక చర్లపల్లి కేంద్రంగా, తాజా నిర్ణయం..!!
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టుల పైన కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ పలు ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేస్తోంది. ఇప్పటికే వందేభారత్ రైళ్లను ఏపీ, తెలంగాణ నుంచి పలు ప్రధాన లైన్లలో నడుపుతోంది. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ త్వరగా పూర్తి చేసి.. రైళ్లను క్రమబద్ధీకరించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో చర్లపల్లి కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
రైల్వే అధికారులు చర్లపల్లి - సికింద్రాబాద్ కేంద్రంగా కొత్త నిర్ణయానికి ఆమోదం తెలిపారు. రైళ్ల నిర్వహణతో పాటుగా జోన్ లో మూడు చోట్ల మెగా కోచింగ్.. ఫ్రైట్ మెయిన్ టెయినెన్స్ డిపోల ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్దం చేసింది. దీని నిమిత్తం సుమారు 300 ఎకరాల భూమి అవసరం అవుతుందని గుర్తించింది. సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యా లయంలో జరిగిన సమావేశంలో జోన్ జనరల్ మేనేజర్ తో పాటుగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్లు.. ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనల పైన చర్చించారు. హైదరాబాద్ నగరం నుంచి రోజూ వందేభారత్ రైళ్లు విశాఖ.. తిరుపతి.. బెంగళూరు.. నాగపూర్ కు వెళ్లి వస్తున్నాయి.

ఈ వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం చర్లపల్లిలో ప్రత్యేక కోచింగ్ డిపో ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అదే విధంగా ప్రయాణీకుల రైళ్లు.. గూడ్స్ రైళ్ల నిర్వహణ కోసం హైదరాబాద్ డివిజన్ లోని జూకల్, గుంతకల్ డివిజన్లలో పాకాలలో మెగా కోచింగ్ డిపోలకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసింది. అదే విధంగా వరంగల్ / మెహబూబా బాద్ మధ్య సుమారు 908.15 కోట్ల వ్యయంతో మెగా ఫ్రైట్ మెయినెటెయినెన్స్ డిపో ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తోంది. వీటికి అవసరమైన భూ సేకరణ పైన కసరత్తు చేయాలని మెకానికల్ విభాగం సంబంధిత డివిజన్ల ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అదే విధంగా సికింద్రాబాద్ జోన్ పరిధి కుదింపు.. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ రావటంతో.. మరిన్ని కీలక నిర్ణయాలకు రైల్వే శాఖ సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications