తెలంగాణాలో ఆ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్, వాతావరణ శాఖ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాలలో వర్ష ప్రభావం కనిపిస్తుంది ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పడిన ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వచ్చే రెండురోజులు వర్షాలు.. నిన్న ఈ జిల్లాలలో కురిసిన వానలు
వచ్చే 48గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఇక నేడు వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలను ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్ లోనూ వర్షాలు కురిసే అవకాశం
ఇక హైదరాబాద్ నగరంలోని నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలు పడే కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణాలో వానలతో పాటు ఎండలు కూడా
ఇదిలా ఉంటే నిన్న ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కూడా పలు జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి వాతావరణ కేంద్రం పేర్కొంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుందని అత్యల్పంగా హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications