హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళలు చెయ్యెత్తిన చోట హైదరాబాద్ సిటీ బస్సులు ఆగాల్సిందే: ఎక్కడైనా ఎక్కొచ్చు, దిగొచ్చు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీఎస్ఆర్టీసీ మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాపులతోపాటు ఎక్కడైనా సరే రాత్రి 7.30 గంటల తర్వాత మహిళలు చెయ్యేత్తిన చోట అక్కడ బస్సు ఆగేలా, దిగాలనుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంది.

మంగళవారం నుంచి ఈ విధానం అమలు కానుందని ఆర్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్లను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ సమయం బస్టాపుల్లోనే వేచి ఉండకుండా.. బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకావం కల్పించినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

Raising their hand, women can stop rtc city buses in any place in hyderabad.

మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వారిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈమేరకు అన్ని బస్సుల్లో డిపో మేనేజర్ల ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.

Recommended Video

వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన ఆ రోజే.. కీలక సన్నివేశాలకు వేదిక కానున్న ఇడుపులపాయ!! || Oneindia Telugu

ఈ సౌకర్యం పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 99592 26160, 9959226154 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అంతేగాక, ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 గంటల వరకు బస్సుల నియంత్రణ అధికారులుండేలా చర్యలు తీసుకున్నారు. ఏపీ ఉద్యోగుల ప్రత్యేక రైలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించడంతో.. అందులో వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

English summary
Raising their hand, women can stop rtc city buses in any place in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X