మోడీ దీపావళి కానుకిచ్చారు.. కేసీఆర్‌కి సోయి లేదా?: బీజేపీ నేతలు రాజా సింగ్, డీకే అరుణ ఫైర్
హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై మరోసారి మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ఈ విషయం ఆలోచించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను అడ్డంపెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిందని గుర్తు చేశారు.

కేసీఆర్ సర్కారు పెట్రోల్‌పై పన్ను తగ్గించాలి: రాజా సింగ్
విమర్శలు చేయడం సులభమే కానీ, ఆచరణలో పెట్టడానికి బలముండాలని టీఆర్ఎస్ సర్కారుకు ఎమ్మెల్యే రాజా సింగ్ చురకలంటించారు. పెట్రోల్‌పై రూ. 41 పన్ను వసూలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం రూ. 8 నుంచి రూ. 10 తగ్గించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఇక ఉపఎన్నిక వస్తేనే టీఆర్ఎస్ నాయకులకు జోష్ వస్తుందని విమర్శించారు.

మోడీ దీపావళి కానుకంటూ డీకే అరుణ
మరోవైపు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కనీసం అభినందించకపోగా, టీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని డీకే అరుణ మండిపడ్డారు.

ఎన్డీయే పాలిత రాష్ట్రాలు పన్ను తగ్గిస్తుంటే కేసీఆర్‌కు సోయి ఉందా?: డీకే అరుణ
ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాట్‌ను తగ్గించి వారి రాష్ట్ర ప్రజలకు భారం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే, మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రం అసలు సోయి కూడా లేదని డీకే అరుణ ఘాటుగా విమర్శించారు. ఇన్ని రోజులు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గించాలంటూ ప్రజల పై ప్రేమ ఉన్నట్లు నటించి, మొత్తుకున్న టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎక్కడ పారిపోయారని డీకే అరుణ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి, ప్రజల శ్రేయస్సు కోసం పెట్రోల్, డీజిల్ ధరల పై పన్నును తక్షణమే తగ్గించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
Recommended Video

ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతోపాటు ఒఢిశాలో పన్ను తగ్గింపు
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. పెట్రోల్, డీజిల్‌పై 7 రూపాయల మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు అసోం, త్రిపుర, కర్ణాటక, గోవా, సిక్కిం రాష్ట్రాలు ప్రకటించాయి.. దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 12, డీజిల్ ధర 17 రూపాయల మేర తగ్గబోతోంది.. బీహార్‌లోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌పై 1.30 రూపాయలు, డీజిల్‌పై 1.90 రూపాయల మేర వ్యాట్ తగ్గించింది.. ఉత్తరాఖండ్ పెట్రోల్‌పై 2 రూపాయలు తగ్గించింది.. ఇక ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాత్ సర్కారు ఏకంగా లీటర్ ఇంధనంపై 12 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గుజరాత్ కూడా పెట్రోల్, డీజిల్ పై 7 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, హర్యానాలోనూ ఇంధన ధరలపై పన్ను తగ్గించాయి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications