రాజయ్య ఉద్వాసన: 'నమస్తే తెలంగాణ' ఏమంది?
హైదరాబాద్: మంత్రివర్గం నుంచి రాజయ్యను తప్పించడంపై 'నమస్తే తెలంగాణ' దినపత్రిక తనదైన శైలిలో ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. రాజయ్యది స్వయం ఫ్లూ పేరు మీద ఆ వార్తాకథనాన్ని ఆ పత్రిక ప్రచురించింది. నమస్తే తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పత్రికగా పేరున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో రాజయ్య ఉద్వాసనపై ఆ పత్రిక కథనం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి పట్టని మంత్రి, స్వైన్ ఫ్లూపై సరిగా స్పందించని వైనం, చట్టూ చేరిన కోటరీతోనే ఆయన ఆభాసుపాలు అంటూ ఉప శీర్షికలు కూడా ఇచ్చి ఆ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.
వైద్య ఆరోగ్య శాఖలోని అవినీతిని, అక్రమాలను రాజయ్య పట్టించుకోకపోగా, పలు విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా ఆయన ఉద్వాసనకు కారణమయ్యాయని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. అవినీతి అక్రమాలు కొన్ని తెలిసిన రాజయ్య సకాలంలో స్పందించలేదని, చుట్టూ చేరిన కోటరీ, ఉద్యోగుల అవినీతి ఆయన పదవికి ఎసరు పెట్టినట్లు ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇవన్నీ తన దృష్టికి రావడంతో కెసిఆర్ పలుమార్లు కొంత మంది మంత్రుల ద్వారా రాజయ్యకు సూచనలు చేస్తూనే ఉన్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలని, అటువంటి విమర్శలు రాకుండా చూసుకోవాలని చెప్పించారని ఆ పత్రిక రాసింది. అయినా, రాజయ్య వినిపించుకోలేదని కూడా రాసింది.

నమస్తే తెలంగాణ పత్రిక వార్తాకథనం సారాంశం - వైద్య ఆరోగ్య శాఖలో రాజయ్య నిబంధనలకు పాతరేశారు. అనర్హులకు పెద్ద పీట వేశారు. దాంతో శాఖ పనితీరు పూర్తిగా గాడి తప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన డిహెచ్ పోస్టులో తగిన అర్హతలు, సీనియారిటీ లోని వారిని తీసుకోవడంతో పూర్తిగా గాడి తప్పింది. జూనియర్‌కు కీలక పోస్టు ఇవ్వడంతో సీనియర్ల సహకారం కొరవడింది. తన ఓఎస్డీగా రాజయ్య తన క్లాస్ మేట్‌ను పెట్టుకోవడంతో ఆయనదే ఇష్టారాజ్యంగా మారింది. మకో ఓఎస్డీతో పాటు వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకులు, పీఆర్వోల వరకు అవినీతి ఆరోపణల్లో భాగస్వాములయ్యారు. దాంతో శాఖ పూర్తిగా నియంత్రణ కోల్పోయింది.
నమస్తే తెలంగాణ ఆ వ్యాఖ్యలు చేయడంతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీలో ఏ విధంగా నిబంధనలకు పాతరేశారు వంటి విమర్శలతో పాటు అవినీతి ఎలా పేరుకుపోయిందనే విషయాలను కూడా రాసింది. చివరగా స్వైన్ ఫ్లూ విషయంలో రాజయ్య సరిగా స్పందించలేదనే ఆరోపణ కూడా చేసింది. దానికి తోడు, కెసిఆర్‌కు ఆయన ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పింది.
కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగితే గానీ పరిస్థితి అదుపులోకి రానంతగా వైద్య ఆరోగ్య శాఖ తప్పుపట్టిందని పత్రిక వ్యాఖ్యానించింది. దాంతో రాజయ్యపై వేటు వేయక తప్పలేదని ఆ పత్రిక అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ విషయంలోనూ రాజయ్య విషయంలోనూ తీసుకున్న నిర్ణయంతో మిగతా శాఖల్లో వణుకు ప్రారంభమైందని ఆ పత్రిక రాసింది. రాజయ్యను తప్పించడం వల్ల ప్రజాప్రతినిధులకు కూడా హెచ్చరికలు వెళ్లాయని నమస్తే తెలంగాణ ముక్తాయింపునిచ్చింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications