చిలుకానగర్ నరబలి: 2 ఏళ్ళుగా నరబలికి యత్నం, రాజశేఖర్‌ను అదే పట్టించింది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఉప్పల్ చిలుకానగర్‌లో ఆడశిశువును నరబలి ఇచ్చారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించారని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ప్రకటించారు. రెండేళ్ళ నుండి నరబలి చేస్తే మంచి జరుగుతోందని కోయదోర ఇచ్చిన సూచనతో రాజశేఖర్ నరబలి ఇచ్చినట్టు మహేష్ భగవత్ చెప్పారు.

  చిన్నారిది నరబలే! అతనే నిందితుడు.. అదే పట్టించింది..!

  చిలుకానగర్ నరబలి: నగ్నంగా రాజశేఖర్ దంపతుల క్షుద్రపూజలు, బోయిగూడ నుండి చిన్నారి కిడ్నాప్

  ఉప్పల్ చిలుకా నగర్ నరబలి కేసులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ప్రధాన నిందితుడుగా పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు చెప్పారు.

  కేసును తప్పుదోవ పట్టించేందుకుగాను రాజశేఖర్ ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ కేసులో అసలు నిందితుడిని పట్టుకొనేందుకు తీవ్రంగా కష్టపడినట్టు సీపీ మహేష్ భగవత్ చెప్పారు. మరో వైపు గురువారం నాడు మహేష్ భగవత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.

  రెండేళ్ళుగా నరబలి కోసం రాజశేఖర్ ప్రయత్నం

  రెండేళ్ళుగా నరబలి కోసం రాజశేఖర్ ప్రయత్నం

  రెండేళ్ళుగా రాజశేఖర్ నరబలి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు . ఓ కోయదొర సూచన మేరకు నరబలి ఇవ్వాలని రాజశేఖర్ నిర్ణయం తీసుకొన్నాడని సీపీ చెప్పారు. కోయదొరకు రాజశేఖర్‌కు మధ్య జరిగిన సంభాషణ‌ను సంబంధించిన ఆడియో సంభాషణను కూడ పోలీసులు గుర్తించారు. తన కుటుంబానికి అన్ని రకాల సమస్యల నుండి బయటపడాలనే ఉద్దేశ్యంతో నరబలి ఇవ్వాలని రాజశేఖర్ చిన్నారిని బలి ఇచ్చాడని సీపీ మహేష్ భగవత్ చెప్పాడు.రెండేళ్ళ క్రితం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళిన రాజశేఖర్‌కు కోయదొర నరబలి ఇవ్వాలని సలహ ఇచ్చారు. గ్రహణం రోజున నరబలి ఇస్తే ఇంకా ప్రయోజనం ఉంటుందని సూచిస్తే రాజశేఖర్ చంద్రగ్రహణం రోజున నరబలి ఇచ్చాడని భగవత్ చెప్పాడు.

  122 మొబైల్స్ డేటా విశ్లేషణ

  122 మొబైల్స్ డేటా విశ్లేషణ

  ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో 122 మంది మొబైల్స్ డేటాను విచారించినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. 40 మంది అనుమానితులను నిశితంగా ప్రశ్నించి వదిలేసినట్టు చెప్పారు.100 సీసీ టీవి పుటేజీల ఆధారంగా విచారణ చేశామని భగవత్ చెప్పారు. అయితే ఈ కేసు నుండి తప్పించుకొనేందుకు ఇతరుల మీదకు అనుమానాన్ని వ్యక్తం చేసేవాడని పోలీసులు చెప్పారు

  ప్రతాప్ సింగారం వద్ద మూసీలో చిన్నారి మెండెం వేసిన రాజశేఖర్

  ప్రతాప్ సింగారం వద్ద మూసీలో చిన్నారి మెండెం వేసిన రాజశేఖర్

  జనవరి 31వ, తేదిన ఉదయం మాదాపూర్ ప్రాంతంలో రాజశేఖర్ క్యాబ్‌లో ప్యాసింజర్లను దింపినట్టు సెల్‌టవర్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. రాత్రి పూట బోయిగూడ ప్రాంతంలో రాజశేఖర్ ఉన్నాడని ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించామన్నారు. బోయిగూడ ప్రాంతంలో చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని భగవత్ చెప్పారు. అయితే రాత్రి ఇంటికి తీసుకొచ్చిన చిన్నారిని ఇంట్లోనే బలి ఇచ్చారు. బలి ఇచ్చిన చిన్నారి మొండాన్ని ప్రతాప్‌సింగారం వద్ద మూసీలో పారేశారు. ప్రతాప్ సింగారం వద్ద రాజశేఖర్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ను గుర్తించామన్నారు. తెల్లవారుజామున క్షుద్రపూజల్లో రాజశేఖర్ దంపతులు పాల్గొన్నట్టు విచారణలో చెప్పారని పోలీసులు చెప్పారు.

  టెర్రస్‌పైనే చిన్నారి తల పెట్టిన రాజశేఖర్

  టెర్రస్‌పైనే చిన్నారి తల పెట్టిన రాజశేఖర్

  నరబలి ఇచ్చిన తర్వాత చిన్నారి తలను రాజశేఖర్ తన ఇంటి మేడ మీద పెట్టాడు. పూజలు పూర్తైన తర్వాత ఉదయం పూట 6 గంటలకు రాజశేఖర్ క్యాబ్ తీసుకొని వెళ్ళాడని పోలీసులు తెలిపారు. అయితే నరబలి విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రాజశేఖర్ ప్రయత్నించినట్టు చెప్పారు.టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకొని ఈ కేసును దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  అదే పట్టించింది

  అదే పట్టించింది

  చిన్నారి నరబలి కేసులో పోలీసులకు చిన్న క్లూ కూడ లభ్యం కాలేదు. అయితే అనుమానితులను ప్రశ్నించి వదిలేశారు. మరోవైపు సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా , మొబైల్స్ డేటాను కూడ పరిశీలించారు కానీ, ఫలితం లేకుండా పోయింది. అయితే రాజశేఖఱ్ ఇంట్లోనే మరోసారి క్లూస్ టీమ్ తో విచారణ చేస్తే ఫలితం ఉంటుందని భావించి చేసిన ప్రయత్నంలోనే విజయం సాధించినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. ఫిబ్రవరి 9వ, తేదిన రాజశేఖర్ ఇంట్లో క్లూస్ టీమ్ పరిశీలిస్తే ఫ్లోర్‌పై రక్తపు మరకలను తుడిచినట్టుగా ఉందని గుర్తించారు ఈ రక్తపు మరకల శాంపిల్స్ చిన్నారి తల భాగం రక్త నమూనాలతో సరిపోల్చేందుకు డిఎన్‌ఏ పరీక్షకు పంపించినట్టు పోలీసులు తెలిపారు. అయితే డిఎన్‌ఏలో ఈ రెండు రక్తం నమూనాలు ఒక్కటేనని తేలడంతో కేసు చిక్కుముడి వీడిందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Rachakonda CP Mahesh Bhagavath said that Rajashekar key person in Chilkanagar child sacrifice case . He spoke to media on Thursday evening at Hyderabad. Rajashekar trying for child sacrifice two years.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి