శిరీష కేసు: రాజీవ్, శ్రవణ్ లు కుకునూర్పల్లికి తరలింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సంచలనం రేపిన బ్యూటీషీయన్ శిరీష , కుకునూర్ ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల కేసుల్లో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ రెండు కేసుల్లోనూ కీలకంగా మారిన ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ అతని స్నేహితుడు శ్రవణ్ ను పోలీసులు గురువారం నాడు కుకునూర్ పల్లికి తీసుకెళ్ళారు.

ఈ రెండు ఆత్మహత్యల కేసుల్లో రాజీవ్, శ్రవణ్ లు కీలక సాక్ష్యులు. వీరిద్దరిని పోలీసులు వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న గురువారం నాడు బంజారాహిల్స్ పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Rajeev and Sravan shifted to Kukunoorpally police station

శిరీష ఆత్మహత్య కేసులో లభించిన ఆధారాలు, రాజీవ్ , శ్రవణ్ ల వాంగ్మూలం తదితర విషయాలను బంజారాహిల్స్ పోలీసులు తిరుపతన్నకు వివరించారు.

అయితే ఆత్మహత్యలు జరగడానికి ముందు కుకునూరుపల్లిలోని ప్రభాకర్ రెడ్డికి చెందిన క్వార్టర్స్ లో శిరీష, శ్రవణ్ , రాజీవ్ లు కలిసి ఉన్నందున అప్పుడేం జరిగిందనే విషయాలపై వాస్తవాలను రాబట్టేందుకుగాను పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు రాజీవ్ , శ్రవణ్లను పోలీసులు కుకునూర్ పల్లికి తీసుకెళ్ళారు.

ఆత్మహత్యకు పాల్పడిన ప్రభాకర్ రెడ్డి మృతదేహనికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత టంగుటూరుకు తరలించారు. ఇవాళ సాయంత్రం పోలీస్ లాంఛనాలతో ప్రభాకర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాకర్ రెడ్డి బంధువులు వరంగల్ హైద్రాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajeev and Sravan shifted to Kukunoorpally police station on Thursday.Sangareddy Dsp Tirupatanna met Banjarahills police. he gathered sirisha suicide information.
Please Wait while comments are loading...