శిరీష కేసు: ఎవరీ రాజీవ్? సినిమాలతో లింకేంటి.. ముందు నుంచి ఇంతేనా!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: శిరీష అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. పోలీసులు ఆమెది ఆత్మహత్య అని నిర్దారించగా.. దీని వెనుక రాజీవ్, శ్రవణ్ ల పాత్రే కీలకంగా ఉందని నిర్దారించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఎలా ఉన్నప్పటికీ.. బయటి నుంచి వినిపిస్తున్న వాదనలు రాజీవ్ అనే వ్యక్తి ఓ మేకవన్నె పులి లాంటి వాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శారీరక సంబంధాలు, శిరీషపై ఎస్ఐ అత్యాచారయత్నం: ఇది సిపి మాట

అమ్మాయిలకు వల వేయడం.. శారీరకంగా వారికి దగ్గరై.. ఆపై వదిలించేసుకోవడం ఇతనికి అలవాటే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. పోలీసుల విచారణలోను స్టూడియో పరిసరాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

రాజీవ్ ఎప్పుడూ అమ్మాయిలతో కనిపించేవాడని, అయితే ప్రొఫెషన్ లో భాగంగా అలా ఉండేవాడేమోనని తాము భావించేవారమని అక్కడివారు చెబుతున్నారు. నాలుగు నెలలకొక సారి అతను గర్ల్ ఫ్రెండ్ ను మార్చేవాడని వారు చెప్పడం గమనార్హం.

ఇదీ రాజీవ్ ప్రొఫైల్:

ఇదీ రాజీవ్ ప్రొఫైల్:

తొలి నుంచి కెమెరా పట్ల ఉన్న ప్యాషన్ తో రాజీవ్ సినిమాటోగ్రాఫర్ మారినట్లు తెలుస్తోంది. విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఆపై వివేకానంద కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.. రాజీవ్ తన అభిరుచి పట్ల ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలో అతను సినిమాటోగ్రఫీ కోర్సు చేసినట్లు అతని ఫోటోగ్రఫీ పేజీ ద్వారా తెలిసింది.

అమ్మాయిలను ఎట్రాక్ట్ చేసేలా!:

అమ్మాయిలను ఎట్రాక్ట్ చేసేలా!:

సినిమాటోగ్రఫీ కోర్సు తర్వాత సొంతంగా ఆర్జే స్టూడియోను ఏర్పాటు చేసిన రాజీవ్.. దాని వంకతో ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు చెబుతున్నారు. ఖరీదైన కారు.. హంగు, ఆర్భాటాలతో, చేతిలో స్టిల్ కెమెరాతో చూడగానే అమ్మాయిలను ఆకట్టుకునేందుకు విపరీతంగా ప్రయత్నించేవాడన్న ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో శిరీష కూడా రాజీవ్ వలలో చిక్కుకుంది. తన కదలికలను ఎవరైనా పసిగడుతున్నారన్న అనుమానంతో అపార్ట్ మెంట్ చుట్టూ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయించాడు.

శిరీషను మాయ చేశాడా?

శిరీషను మాయ చేశాడా?

ఒకవిధంగా శిరీషను రాజీవ్ తెలివిగా ట్రాప్ చేశాడన్న ఆరోపణలున్నాయి. ఫోటోగ్రాఫర్ గా ఓ పెళ్లికి వెళ్లిన అతనికి.. బ్రైడల్ బ్యుటీషియన్ గా పనిచేస్తున్న శిరీష పరిచయమైంది. అక్కడే శిరీషతో మాటలు కలిపి మెల్లిగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు.ఇందులో భాగంగా లగ్జరీ లైఫ్ పట్ల శిరీషకు రాజీవ్ లేని పోని ఆశలు కల్పించినట్లు తెలుస్తోంది.

రాజీవ్ స్టూడియోలో శిరీష జాయిన్ అయ్యాక.. ఇక ఆమెను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవడంలో అతను సక్సెస్ అయ్యాడు. క్రమక్రమంగా వర్క్ పేరుతో ఆమెను స్టూడియోకే పరిమితం చేశాడు. ఒక్కోసారి శిరీష.. ఇంటికి కూడా రెండు మూడు రోజులు వెళ్లకుండా స్టూడియోలోనే ఉండిపోయేదంటే పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు.

శారీరకంగా దగ్గరై..:

శారీరకంగా దగ్గరై..:

విలాసవంతమైన జీవితాన్ని ఆశచూపి మొత్తానికి శిరీషతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు రాజీవ్. రాజీవ్ తో పరిచయం తర్వాత శిరీష లైఫ్ స్టైల్ కూడా మారిపోయినట్లు తెలుస్తోంది. భార్య బ్యుటీషియన్ కాబట్టి.. ఆ తరహా డ్రెస్సింగ్ కామన్ అని శిరీష భర్త సతీష్ చంద్ర భావించాడు. కానీ అసలు విషయాన్ని అతను కూడా పసిగట్టలేకపోయాడు.

ఇంతలోనే తేజస్విని అనే మరో అమ్మాయిని ట్రాప్ చేసిన రాజీవ్.. తెలివిగా శిరీషను సైడ్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఆమెను ఉద్యోగం నుంచి తప్పించాలని నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. శిరీష మాత్రం ఉద్యోగం మానేసేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. శిరీషతో శారీరక సంబంధం గురించి తేజస్వినికి కూడా తెలిసిపోవడంతో ఇక ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని శ్రవణ్ తో కలిసి పథకం పన్నాడు. ఆపై కుకునూర్ పల్లి వెళ్లడం, శిరీష, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.

రాజీవ్ తీసిన సినిమాలు:

రాజీవ్ తీసిన సినిమాలు:

సినిమాటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న రాజీవ్.. పలు లఘుచిత్రాలకు డీఓపీ(డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ)గా వ్యవహరించాడు. భయం అనే సినిమాకు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించడంతో పాటు చెలి అనే సినిమాను సొంత దర్శకత్వంలో తెరకెక్కించాడు. వీటితో పాటు దాదాపు 60కి పైగా వివాహాది శుభకార్యాలను షూట్ చేసినట్లు తన ఫేస్ బుక్ లో రాసుకున్నాడు.

ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్

ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్

ఓ రచయిత పెన్నును ఎంతగా ప్రేమిస్తాడో.. అలాగే ఓ పోరాట యోధుడు తన ఖడ్గాన్ని ఎంతలా ఆరాధిస్తాడో.. తాను కూడా తన కెమెరాను అంతగా ఆరాధిస్తానని రాజీవ్ తన ఫోటోగ్రఫీ పేజీలో రాసుకున్నాడు. ఏదైనా మంచి చిత్రాన్ని మంచి లైటింగ్ లో సరిగ్గా క్యాప్చర్ చేసినప్పుడు తనకు ఉత్సాహంగా అనిపిస్తుందని తన వ్యక్తిగత విషయాలను అందులో పంచుకున్నాడు.

ఐదేళ్ల నుంచి ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ లో ఉన్న తాను.. ఇప్పటివరకు వెనుదిరిగి చూడలేదని తన పేజీలో వెల్లడించాడు. వెడ్డింగ్స్, బర్త్ డే, ఆనివర్సరీస్ ఇతరత్రా కార్యక్రమాలకు తాను ఫోటోగ్రఫీ చేసినట్లు అందులో తెలిపాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajeev, A2 accused person in Sirisha's suicide was a cinematographer. He did some shortfilms as DOP and director also.
Please Wait while comments are loading...