సింథియా హత్య: చైల్డ్ వెల్ఫేర్‌లోనే సానియా, డీఎన్ఏ పరీక్ష వాయిదా
హైదరాబాద్: తల్లి సింథియాను తన తండ్రి రూపేష్ హత్య చేయడంతో వారి కూతురు సానియా ఎవరికి చెందాలనే విషయంపై సోమవారం రాజేంద్రనగర్ కోర్టు విచారించింది. ఆఫ్రికాలోని కాంగోకు చెందిన సింథియాను భర్త రూపేష్ అత్యంత కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి తగులబెట్టిన విషయం తెలిసిందే.
కాగా, వారి కూతురు సానియా ఎవరికి చెందాలనే వ్యవహారంలో శుక్రవారం రాజేంద్రనగర్, ఎల్బీనగర్ కోర్టుల్లో అనేక తర్జన భర్జనల తర్వాత కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సింథియా కూతురు సానియా తమకే చెందాలని ఆమె నానమ్మ కోరుతుండగా, తమకే చెందాలని సింథియా కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సానియా నానమ్మ, రూపేశ్ తల్లి లలితా దేవి వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం రేపటికి(మంగళవారానికి) వాయిదా వేసింది. సానియాకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించాలన్న పిటిషన్ పై కూడా కోర్టు మంగళవారం విచారించనుంది.
కాగా, కాలిపోయిన మృతదేహం సింథియాదేనని నిర్ధారణ చేయడం కోసం సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించే అవకాశముంది.
సానియా ఎవరి సంరక్షణలో పెరగాలనే అంశం తేలేవరకు ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని సీసీఎస్ పోలీసులకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతోపాటు రూపేశ్ కష్టడీపైనా కోర్టు మంగళవారం తీర్పు ప్రకటించనుంది. కోర్టుల విచారణ సందర్భంగా కాంగో నుంచి వచ్చిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, ఆ దేశ దౌత్యాధికారులు కోర్టుకు వచ్చారు.












Click it and Unblock the Notifications