RTC: రాఖీ పండుగకు ఆర్టీసీకి భారీగా ఆదాయం..
సాధారణంగా ఆర్టీసీకి పెద్ద పండుగలకు ఎక్కువగా ఆదాయం వస్తుంది. బతుకమ్మ, సంక్రాంతి పండుగలకు ఎక్కువ మంది ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. మిగతా పండుగులకు రద్దీ సాధారణం నుంచి ఓ మోస్తరు వరకు ఉంటుంది. అయితే ఈసారి రాఖీ పండుగకు ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. రాఖీ బుధ, గురువారం వచ్చింది. కొద్దరు బుధవారం రాఖీ పండుగు చేసుకుంటే.. మరికొందరు గురువారం రాఖీ పండుగ చేసుకున్నారు. అయితే గురువారం తర్వాత శుక్రవారం ఒక్క రోజే వర్కింగ్ డే కావడంతో చాలా మంది శుక్రవారం లీవ్ పెట్టారు.
మరి కొందరు వర్క్ ఫ్రమ్ హో చేసుకున్నారు. దీంతో బుధ, గురువారం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు భారీగా ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ ఆదాయం పెరిగింది. బుధవారం తెలంగాణ వ్యాప్తంగా 9 వేల బస్సు సర్వీసులు నడిపినట్లు ఆర్టీసీ పేర్కొంది. దీంతో పాటు రూ.18,25 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. సాధారణ రోజుల్లో ఈ ఆదాయం రూ.15 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలకు రద్దీ ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ కరీంనగర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నిజామాబాద్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంది.

ఇక ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ గురువారం కూడా కొనసాగింది. గురువారం 19 కోట్ల రూపాయలు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ రూ.20.10 కోట్ల ఆదాయం పొందింది. ఈ ఏడాది గతేడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం నుంచి ప్రయాణికులు తిరుగుముఖం పడతారు. దీంతో ఆర్టీసీ బసుస్సుల్లో రద్దీ పెరగనుంది. బుధ, గురువారాలు జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రజలు బస్సులు లేక ఇబ్బంది పడ్డారు.

చాలా మంది ప్రయాణికులు టికెట్లు ఆన్ లైన్ బుక్ చేసుకోవడంతో వచ్చిన బస్సులన్నీ రిజర్వేషన్ అని చెబుతున్నారని ప్రయాణికిలు వాపోయారు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఆది, సోమ వారాల్లో ఎక్కువ బస్సులు నడుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కాగా రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఆర్టీసీ లక్కీ డ్రా అవకాశం కల్పించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 లక్షల50 వేల విలువైన బహుమతులకు గాను లక్కీ డ్రా అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications