వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Lockdown: రంజాన్ ముందు ఇలాగైతే ఓవైసీ చేతిలో కేసీఆర్‌కు దెబ్బలే: బీజేపీ బండి సంజయ్ అనూహ్యం

|
Google Oneindia TeluguNews

దక్షిణ భారతంలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో కొత్త కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. కేసీఆర్ సర్కారు చెబుతోన్న మరణాలు, కేసుల లెక్కలపై కోర్టులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్నదని, కఠిన ఆంక్షలు ఉండబోవని గట్టిగా చెబుతూ వచ్చిన సీఎం కేసీఆర్.. చివరికి లాక్ డౌన్ విధిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. అయితే, సరిగ్గా రంజాన్ పండుగ సమయంలో ప్రకటించిన లాక్ డౌన్ కచ్చితంగా అమలయ్యేంత సీన్ ఉండదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు..

Recommended Video

Telangana Lockdown : రంజాన్ ముందు ఇలాగైతే ఓవైసీ చేతిలో కేసీఆర్‌కు దెబ్బలే - Bandi Sanjay

 వ్యాక్సిన్లపై వివాదం: బీజేపీ ఉచితంగా ఇస్తుంది, కాంగ్రెస్‌కు దమ్ముందా? సోనియాకు జేపీ నడ్డా సవాల్ వ్యాక్సిన్లపై వివాదం: బీజేపీ ఉచితంగా ఇస్తుంది, కాంగ్రెస్‌కు దమ్ముందా? సోనియాకు జేపీ నడ్డా సవాల్

ఉదయం 6నుంచి 10 అంతా ఫ్రీ

ఉదయం 6నుంచి 10 అంతా ఫ్రీ

కరోనా వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈనెల 12(బుధవారం) నుంచి మే22 వరకు, అంటే 10 రోజులపాటు లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ నిర్ణయించింది. అయితే, కఠిన లాక్ డౌన్ కు ముందు నుంచీ విముఖంగా ఉన్న కేసీఆర్.. రాబోయే 10 రోజులపాటు ఉదయం 6 నుంచి 10 గంటలవరకు మినహాయింపులు ఇచ్చారు. అంటే, 4గంటలపాటు జనం కదలికలు, వ్యాపారాలపై ఆంక్షలు ఉండవు. ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుంది. కాగా, మరికొద్ది గంటల్లో రంజాన్ పండుగ ఉండగా కేసీఆర్ సర్కారు లాక్ డౌన్ విధించడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనూహ్య కామెంట్లు చేశారు..

కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్

తూతూమంత్రంగా లాక్‌డౌన్..

తూతూమంత్రంగా లాక్‌డౌన్..

కరోనా ఆంక్షలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా ఇచ్చిన ఆంక్షల ఆదేశాలేవీ సరిగా అమలు కాలేదని, లాక్ డౌన్ విషయంలోనూ అలానే జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. కరోనా కేసులు, మరణాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని, కేసీఆర్ సరైన లెక్కలు చెప్పని కారణంగానే కేంద్రం నుంచి తెలంగాణకు పూర్తిస్థాయిలో సహాయం అందడంలేదన్నారు. ప్రధాని మోదీకి సలహాలిచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటని, ఉన్నతస్థాయిలో జరిగే అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైంది కాదని సంజయ్ మండిపడ్డారు. అలాగే..

రంజాన్ వేళ లాక్‌డౌన్.. కేసీఆర్, ఓవైసీ

రంజాన్ వేళ లాక్‌డౌన్.. కేసీఆర్, ఓవైసీ


మరికొద్ది గంటల్లో ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిర్ణయంపై బీజేపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రంజాన్ పండగకు ముందు లాక్‌డౌన్ పెడితే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తనవాళ్లను వెంటేసుకొని సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చి.. కేసీఆర్‌ను బరిగెలతో కొడతారు. ఇప్పటికే మజ్లిస్ చీఫ్ అంటే సీఎంకు వణుకు. పాతబస్తీలో నైట్ కర్ఫ్యూ అమలు కాకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోంది. నిఖార్సైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ భయంతోనే ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నాడు. కేవలం హైకోర్టుకు భయపడి లాక్ డౌన్ పెట్టాలనుకుంటున్నాడేగానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కాదు'' అని బండి సంజయ్ అన్నారు.

English summary
Telangana government, led by cm kcr on Tuesday, announced a 10-day statewide lockdown in view of covid surge. The lockdown will be implemented from May 12 to May 22. regarding kcr lockdown decision, telangana bjp chief bandi sanjay kumar made sensational comments. speaking to media on tuesday, sanjay alleges that lockdown orders would not implemented till ramadan festival end, the bjp said kcr is collided with aimim chief asaduddin owaisi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X