వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక కోసం.. కేంద్ర బలగాల పహారాలో ముస్తాబైన రామప్ప!!

|
Google Oneindia TeluguNews

భారతదేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా శీతాకాల విడిది కోసం సోమవారం నాడు హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ద్రౌపదీ ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శించి అక్కడ ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

 ద్రౌపది ముర్ము రామప్ప పర్యటన .. ఘనంగా ఏర్పాట్లు ఇక నేడు హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నెలకొల్పిన వైట్ ప్లేట్ మిల్లును మంగళవారం ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాన్ని, భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. ఈ క్రమంలో రేపు ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ద్రౌపది ముర్ము సందర్శన ఏర్పాట్లను అధికారులు ఘనంగా చేస్తున్నారు.

ద్రౌపది ముర్ము రామప్ప పర్యటన .. ఘనంగా ఏర్పాట్లు ఇక నేడు హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నెలకొల్పిన వైట్ ప్లేట్ మిల్లును మంగళవారం ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాన్ని, భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. ఈ క్రమంలో రేపు ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ద్రౌపది ముర్ము సందర్శన ఏర్పాట్లను అధికారులు ఘనంగా చేస్తున్నారు.

ద్రౌపది ముర్ము రామప్ప పర్యటన .. ఘనంగా ఏర్పాట్లు
ఇక నేడు హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నెలకొల్పిన వైట్ ప్లేట్ మిల్లును మంగళవారం ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప దేవాలయాన్ని, భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు. ఈ క్రమంలో రేపు ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ద్రౌపది ముర్ము సందర్శన ఏర్పాట్లను అధికారులు ఘనంగా చేస్తున్నారు.

ఆలయాన్ని స్వాధీనంలోకి తీసుకున్న కేంద్ర బలగాలు

ఆలయాన్ని స్వాధీనంలోకి తీసుకున్న కేంద్ర బలగాలు


రాష్ట్రపతి రాక సందర్భంగా రామప్ప దేవాలయం చుట్టూ నిఘా ఏర్పాటు చేసి, ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు కేంద్ర బలగాలు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ద్రౌపది ముర్ము సందర్శన నేపథ్యంలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఆలయానికి సమీపంలో మూడు హెలిప్యాడ్ లను ఏర్పాటు చేశారు. సోమవారం నాడు ఆర్మీ హెలికాప్టర్ లో ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లను రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎన్ఎస్జి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

రేపు రామప్పలో రాష్ట్రపతి పర్యటన ఇలా

రేపు రామప్పలో రాష్ట్రపతి పర్యటన ఇలా


ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో నేడు, రేపు రామప్ప కు వచ్చే సాధారణ భక్తులకు సందర్శనను నిలిపివేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు డిసెంబర్ 28వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రామప్పలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును ఆమె అక్కడ ప్రారంభించనున్నారు.

రామప్ప పరిసర ప్రాంతాలలో నిషేదాజ్ఞలు

రామప్ప పరిసర ప్రాంతాలలో నిషేదాజ్ఞలు


ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఆదివాసి కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లను చేశారు. రామప్ప పరిసర ప్రాంతాలలో నిషేధాజ్ఞలు జారీ చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రామప్ప గార్డెన్ ను సుందరంగా ముస్తాబు చేయడంతోపాటు ప్రాంగణమంతా శానిటైజ్ చేసి సిద్ధం చేశారు.

రామప్ప ఆలయానికి రెండురోజుల పాటు సందర్శకుల నిలిపివేత.. కారణం ఇదే!!రామప్ప ఆలయానికి రెండురోజుల పాటు సందర్శకుల నిలిపివేత.. కారణం ఇదే!!

English summary
Ramappa was put on guard by the central forces for the arrival of President Draupadi Murmu. Officials have completed all arrangements in view of President Draupadi Murmu's visit tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X