మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కన్నుమూత -రామాయంపేటలో విషాదం -సీఎం అంజయ్య కోసం పదవీత్యాగం
తెలంగాణ కాంగ్రెస్ వెటరన్, రామాయంపేట మాజీ శాసన సభ్యుడు రాజయ్యగారి ముత్యం రెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు జెడ్పీ చైర్మన్, శాసన మండలి సభ్యుడిగానూ పనిచేసిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
రాజయ్యగారి ముత్యం రెడ్డి స్వస్థలం చిన్నశంకరం పేట మండలం కామారం గ్రామం. 1978 లో రామయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. అయితే, 1980లో కాంగ్రెస్ హైకమాండ్ హఠాత్తుగా టీ.అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించడంతో, అప్పటికి సొంత వర్గమంటూ లేని అంజయ్య కోసం ముత్యంరెడ్డి పదవీత్యాగం చేశారు.

రామాయంపేట ఎమ్మెల్యేగా పదవీ త్యాగం చేసినప్పటికీ తర్వాతి కాలంలో ముత్యం రెడ్డి ఎమ్మెల్సీగా, జెడ్పీ చైర్మ్ గా ప్రజలకు సేవలందించగలిగారు. వృధాప్య సమస్యలతో చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ఆయనకు కొద్దిరోజుల కిందట ఆరోగ్యం క్షీణించింది. రాజయ్యగారి ముత్యం రెడ్డి మరణంతో ఆయన స్వస్థలంలో విషాదం నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మెదర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన రాజయ్యగారి ముత్యం రెడ్డి మరణంపై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. సోమవారమే అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది.












Click it and Unblock the Notifications