మెట్టు దిగిన మహేష్ కత్తి కానీ: 'పవన్‌ను నేను అడుగుతా, ప్రతివాడూ అభిమానేనా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ మీడియాలో హైప్ సంపాదించుకున్న మహేష్ కత్తి ఓ మెట్టు దిగారు. పలుమార్లు పవన్ కళ్యాణ్‌ను ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం ఏమిటని ఆగ్రహించారు.

ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ కత్తి స్పందిస్తూ.. అందరూ తనను క్షమాపణ చెప్పమంటున్నారని, అలా తాను ఎందుకు చేయాలని వ్యాఖ్యానించారు. తాను క్షమాపణ చెప్పేది లేదన్నారు. అయితే ఇక నుంచి పవన్ పర్సనల్ విషయాల గురించి మాత్రం మాట్లాడనని చెప్పారు. పర్సనల్ విషయాలు మాట్లాడటంపై క్షమాపణ చెప్పనని ఖరాఖండిగా చెప్పడం కూడా సరికాదని కొందరు అంటున్నారు.

అలా నా అభిప్రాయం చెబుతా

అలా నా అభిప్రాయం చెబుతా

దీనిని పక్కన పెడితే, మహేష్ కత్తి ఇంకా మాట్లాడుతూ.. రాజకీయంగా, సినిమాలపరంగా మాత్రం తన అభిప్రాయం చెబుతానని అన్నారు. తాను పెట్టే పోస్టులకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బూతులు తిట్టకుంటే చాలునని అన్నారు. అయితే, దీనిపై నటుడు, నిర్మాత రాంకీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

కామెంట్ చేసిన ప్రతివాడు పవన్ అభిమాని అంటే ఎలా

కామెంట్ చేసిన ప్రతివాడు పవన్ అభిమాని అంటే ఎలా

విమర్శలు చేసే ప్రతివాడిని, కామెంట్ పెట్టే ప్రతివాడిని పవన్ కళ్యాణ్ అభిమాని అంటే ఎలా అని రాంకీ ప్రశ్నించారు. కాగా, పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు కేవలం అభిమానులే కాదు.. అందరూ ఆయనను నిలదీశారు. అసలు ఈ వివాదానికి తెరలేపిందే మహేష్ క్తి అని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు అభిప్రాయపడినట్లే, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు.. అభిప్రాయాలపై రియాక్ట్ కావడం కూడా సహజమే అన్నారు.

ఆయనకే ఇంత ఇగో ఉంటే

ఆయనకే ఇంత ఇగో ఉంటే

అసలు మహేష్ కత్తి తిరిగి రియాక్ట్ కాకుంటే ఈ గోలనే ఉండేది కాదని రాంకీ అన్నారు. ఒక్క ఆయనకే అంత ఇగో ఉంటే లక్షలాది మంది పవన్ అభిమానులకు ఎంత ఇగో ఉండాలని, అయిందేదో అయింది, ఇప్పటికైనా మహేష్ కత్తి తాను వ్యక్తిగతంగా పవన్‌ను టార్గెట్ చేయనని చెప్పాలన్నారు. అప్పుడే వివాదం ముగుస్తుందని చెప్పారు.

మహేష్ కత్తి క్షమాపణ చెబితే

మహేష్ కత్తి క్షమాపణ చెబితే

ఒకవేళ మహేష్ కత్తి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఎవరైనా అభిమాని మహేష్ కత్తిని కామెంట్ చేస్తే అప్పుడు సినిమా పరిశ్రమనే కాదు, ప్రతి ఒక్కరు ఆయనను సపోర్ట్ చేస్తారని రాంకీ చెప్పారు. తన మద్దతుతో పాటు ఇండస్ట్రీ పెద్దల మద్దతు ఉంటుందన్నారు. టార్గెట్ చేస్తున్నారనే సింపతీ కూడా ఉంటుందన్నారు. స్వయంగా తానే పవన్ కళ్యాణ్‌ను అడుగుతానని, అభిమానులు ఇలా చేస్తున్నారని, మీరు ఏదో చేయాలని చెబుతానని అన్నారు.

చిరంజీవి లాంటి వారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాలి

చిరంజీవి లాంటి వారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాలి

కాగా, మహేష్ కత్తి పదేపదే పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. చిరంజీవి, మోహన్ బాబు లాంటి వారు సినిమా ఇండస్ట్రీకి పెద్దలుగా మారాలని అన్నారు. అప్పుడు మాత్రమే ఇటువంటి విషయాలు మొగ్గలో తుంచేయగలమని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor and Producer Ramky demands apology from Mahesh Kathi for targetting Pawan Kalyan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X