మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చండీయాగానికి రామోజీరావు, స్వయంగా తీసుకెళ్లిన కెసిఆర్: 27న చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: అయుత చండీ యాగంలో పాల్గొనేందుకు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లిలో గల యాగక్షేత్రానికి బుధవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రామోజీరావు, శ్రీశ్రీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

వీరిని యాగశాల వద్దకు తీసుకు వెళ్లారు. కాగా, యాగశాలలో చండీమహాయాగం కొనసాగుతుంది. యాగాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయుత చండీ మహాయాగం బుధవారం తొలిరోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, రామోజీరావు తదితరులు హాజరయ్యారు. ఈ నెల 24న కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఈనెల 25న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, 26న తమిళనాడు గవర్నర్ రోశయ్య యాగానికి హాజరుకానున్నారు.

Ramoji Rao attends ayutha chandi yagam

ఈనెల 27న ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరవుతారు. అదేరోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఇతర విశిష్ట అతిథులు కూడా రానున్నారు.

లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ బుధవారం నుంచి అయుత చండీ మహాయాగం ప్రారంభమైంది. ఇది ఓ బృహత్ యజ్ఞమే! ఎక్కడా అపశ్రుతి దొర్లకుండా, పకడ్బందీగా ఈ యాగనిర్వహణకు జరిగిన భారీ ఏర్పాట్లు చేశారు.

English summary
Ramoji Rao attends ayutha chandi yagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X