హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌న‌నాయ‌కురాలిగా కీర్తి గడిస్తారని - కవితకు రామెజీ లేఖ : రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. తాజాగా స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల కోటాలో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో గెలివటంతో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు కవితకు లేఖ రాసారు. ఇప్పుడు ఈ లేఖ రాసిన అంశం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలోనూ కవిత ఎంపీగా చేసారు. ఆ సమయంలో ఎటువంటి లేఖలు రాయలేదు. అందునా ఈ లేఖ లో కవితను ప్రశంసిస్తూ..ఉన్నతిని ఆకాంక్షిస్తూ రామోజీ లేఖ రాసారు.

జ‌న‌నాయ‌కురాలిగా ఇనుమడించి

జ‌న‌నాయ‌కురాలిగా ఇనుమడించి

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగించి ప్రాబ‌ల్యం చాటుకున్న మీరు శాస‌న‌మండ‌లిలో ప్ర‌జా వాణిని మ‌రింత గట్టిగా వినిపించి జ‌న‌నాయ‌కురాలిగా ఇనుమడించినా కీర్తి గ‌డిస్తార‌ని విశ్వ‌శిస్తున్నాను అంటూ ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌జాసేవ‌లో మ‌రెన్నో విజ‌యాలు సాధించి అంద‌రి మ‌న్న‌న‌లందుకుంటార‌ని భావిస్తూ.. రామోజీరావు అంటూ అభినంద‌న లేఖ‌ను ముగించారు. కవిత తో పాటుగా మరి కొంత మంది ఎమ్మెల్సీలు అయినా..కవితకు మాత్రమే రామోజీ లేఖ రాయటం ఈ చర్చకు కారణమైంది.

నాడు కేటీఆర్ ను ప్రశంసిస్తూ

నాడు కేటీఆర్ ను ప్రశంసిస్తూ

ముఖ్యమంత్రి కుమార్తె కావటంతోనే ఈ లేఖ రాసి ఉంటారనే చర్చ సాగుతోంది. కవిత సోదరుడు..ముఖ్యమంత్రి తనయుడు అయిన మంత్రి కేటీఆర్ జన్మదినం నాడు సైతం రామోజీ రావు లేఖ రాసారు. అందులో కేటీఆర్ పైన ప్రశంసలు కురిపించారు. చెబుతూనే...ఆయన పని తీరును అభినందనలతో ముంచెత్తారు. సాధారణంగా రాజకీయ నేతలు... అధికారులు ఒక మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం సాధారణంగా జరిగేదే. అయితే, ఇప్పుడు రామోజీ నేరుగా కేటీఆర్ కు అభినందనలతో లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి కుమార్తె కావటంతోనేనా

ముఖ్యమంత్రి కుమార్తె కావటంతోనేనా

పరిణితి కలిగిన నాయకుడంటూ.. అరుదైన నాయకత్వ లక్షణాలు..అసాధారణ సంభాషణ నైపుణ్యం..అన్నింటినీ మించిన రాజకీయ చతురుత తో అనతి కాలంలోనే పరిణితి కలిగిన నాయకుడిగా ఎదిగి తెలంగాణ రాజకీయ యవనికపై వెలుగునీలుతున్నారంటూ కేటీఆర్ ను ప్రశంసిస్తూ..పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఒక ఉన్నత శ్రేణి నాయకునికి కావాల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన మీ పని తీరును తాను తొలి నుండి గమనిస్తూనే ఉన్నానని.. మీరు సాధించిన పురోగతి చూసి గర్విస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

Recommended Video

Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చ

రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చ

తన బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలని ప్రతీ తండ్రి కోరుకుంటాడని..తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చి దిద్దటానికి మీరు చేస్తున్న నిరంతర శ్రమ..నాన్న గారి ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఆయనకు అమితానందన్నిస్తోందని భావిస్తున్నట్లు వివరించారు. అంతకు ముందు రామోజీ రాజకీయ నేతలకు ఇటువంటి లేఖలు రాసిన దాఖలాలు లేవు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్ కు ..ఇప్పుడు కవితకు ప్రత్యేకంగా రామోజీ రావు లేఖలు రాయటం ద్వారా దీని పైన ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు.

English summary
Eenadu Group Chairman Ramoji Rao letter to Kalvakuntla Kavitha, congratulated her on election as MLC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X