హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనిపించిన నెలవంక: నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఏపీలలో పవిత్ర రంజాన్ మాసం సోమవారమే మొదలైందని రయత్-ఎ-హిలాల్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు మంగళవారం తెల్లవారూజాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని ప్రకటించింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం వల్ల హైదరాబాద్‌లో నెలవంక కనిపించలేదు.

అయితే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నెలవంక దర్శమైనట్లు సమాచారం అందింది. దీంతో సోమవారం సాయంత్రం ఇషా నమాజ్ తర్వాత ఉపవాస దీక్ష ప్రారంభ సూచనగా నగరంలోని మసీదులలలో సైరన్లు మోగించారు. దీంతో రంజాన్ మాసపు మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున సహార్‌తో మొదలైంది.

హైదరాబాద్‌లో చారిత్రక మక్కా మసీదులో ముస్లిం సోదరులు సోమవారం రాత్రి ఇషా నమాజ్, అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటల సహార్‌తో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6.55 గంటలకు ఉపవాస దీక్ష విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.

నెలరోజుల తర్వాత తిరిగి నెలవంక దర్శనంతో ఉపవాసాలకు స్వస్తిజెప్పి పండుగ (ఈదుల్ ఫిత్ర్) చేసుకుంటారు. మరోవైపు రంజాన్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 'అమెరికన్ ముస్లింలంతా ఈ పవిత్ర మాసాన్ని వేడుకగా నిర్వహించుకోవాలి. మనమంతా అమెరికన్లం.. మనల్ని రకరకాల వాదాలతో ఎవరూ విడదీయలేరు' అని తన సందేశంలో పేర్కొన్నారు.

కాగా చైనా ప్రభుత్వం ఎప్పటిలాగే ఈసారి కూడా ఉపవాసదీక్షలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఉన్నాతాధికారులు, విద్యార్ధులు, పిల్లలు ఉపవాస దీక్ష చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

తెలంగాణ, ఏపీలలో పవిత్ర రంజాన్ మాసం సోమవారమే మొదలైందని రయత్-ఎ-హిలాల్ కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు మంగళవారం తెల్లవారూజాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని ప్రకటించింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం వల్ల హైదరాబాద్‌లో నెలవంక కనిపించలేదు.

 నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

అయితే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నెలవంక దర్శమైనట్లు సమాచారం అందింది. దీంతో సోమవారం సాయంత్రం ఇషా నమాజ్ తర్వాత ఉపవాస దీక్ష ప్రారంభ సూచనగా నగరంలోని మసీదులలలో సైరన్లు మోగించారు. దీంతో రంజాన్ మాసపు మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున సహార్‌తో మొదలైంది.

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

హైదరాబాద్‌లో చారిత్రక మక్కా మసీదులో ముస్లిం సోదరులు సోమవారం రాత్రి ఇషా నమాజ్, అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటల సహార్‌తో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6.55 గంటలకు ఉపవాస దీక్ష విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
 నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నెలరోజుల తర్వాత తిరిగి నెలవంక దర్శనంతో ఉపవాసాలకు స్వస్తిజెప్పి పండుగ (ఈదుల్ ఫిత్ర్) చేసుకుంటారు. మరోవైపు రంజాన్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

 నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

'అమెరికన్ ముస్లింలంతా ఈ పవిత్ర మాసాన్ని వేడుకగా నిర్వహించుకోవాలి. మనమంతా అమెరికన్లం.. మనల్ని రకరకాల వాదాలతో ఎవరూ విడదీయలేరు' అని తన సందేశంలో పేర్కొన్నారు.

 నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

నేటి నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు

కాగా చైనా ప్రభుత్వం ఎప్పటిలాగే ఈసారి కూడా ఉపవాసదీక్షలపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఉన్నాతాధికారులు, విద్యార్ధులు, పిల్లలు ఉపవాస దీక్ష చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

English summary
The holy month of fasting or Ramadan will begin in a majority of the states in India on Tuesday, although Muslims in southern state of Kerala began Ramadan (also referred to as Ramzan) fasting on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X