హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేఎం ప్రతాప్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ సలహాదారు డీ శ్రీనివాస్, గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత్‌రావు కేఎం ప్రతాప్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువాను కప్పి టీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేఎం ప్రతాప్, ఆయన కుమారుడు యువజన కాంగ్రెస్‌నేత కేపీ విశాల్‌ను టీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, డీఎస్ అభినందించారు. ఈ సందర్భంగా కేఎం ప్రతాప్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధన కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు.

తనకు పదవులపై ఆశ లేదని ప్రతాప్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వాల కంటే టీఆర్‌ఎస్ సర్కారు మెరుగైన పాలన అందిస్తోందన్నారు. అభివద్ధి, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో తాజా కేటాయింపులే ఇందుకు నిదర్శనమన్నారు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణను మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దే సత్తా కేసీఆర్‌కు తప్ప ఏ నాయకుడికి లేదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని తాము కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండాను ఎగురవేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

 కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన కేఎం ప్రతాప్ సామాన్య కార్యకర్తస్థాయి నుంచి డీసీసీ ఆధ్యక్షుడి వరకు కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా ఆయనకు మంచి పేరుంది.

 కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన జలగం వెంగళరావు నుంచి బొత్స సత్యనారాయణ హయాం వరకు కేఎం ప్రతాప్ యూత్ కాంగ్రెస్, కార్మిక విభాగం, డీసీసీ అధ్యక్ష పదవులను చేపట్టారు. ఎం.సత్యనారాయణరావు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నపుడు ఆయన డీసీసీ అధ్యక్షుడిగా నియామకమయ్యారు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

ఆ తర్వాత ఆయన 14 ఏళ్ల పాటు డీసీసీ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. కాంగ్రెస్‌లో వీహెచ్, ఎం.సత్యనారాయణరావు ప్రతాప్ అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. డీ శ్రీనివాస్ ఆయనకు గాడ్‌ఫాదర్‌గా చెప్పుకుంటారు. యూత్ కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నపుడే కేఎం ప్రతాప్ హైదరాబాద్ కార్మిక బందు బిరుదును అందుకున్నారు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

సీనియర్ రాజకీయనేతగా ఉన్న కేఎం ప్రతాప్ టీఆర్‌ఎస్‌లో చేరడం హర్షణీయమని మంత్రి తలసాని, మైనంపల్లి తదితర గ్రేటర్ టీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. జల్లావ్యాప్తంగా ఆయన వర్గీయులు, అభిమానులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్‌కు తరలివచ్చి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతాప్ చేరికతో జిల్లాలో టీఆర్‌ఎస్ బలం మరింత పుంజుకోనుంది.

 కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కేఎం ప్రతాప్ తన మద్దతుదారులతో పెద్ద ఎత్తున ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కుత్బుల్లాపూర్‌లోని తన నివాసం నుంచి వందలాది కార్లు, జీపులు, బుల్లెట్లతో ర్యాలీగా బయలుదేరి బంజారాహిల్స్‌కు చేరుకున్నారు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

కాంగ్రెస్‌కు గుడ్‌బై: భారీ ర్యాలీ, కారెక్కిన కేఎం ప్రతాప్

అంతకుముందు ప్రతాప్ తన కొడుకు విశాల్, కార్యకర్తలతో కలిసి సూరారం కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, నియోజకవర్గ నాయకుడు కొలన్ హన్మంత్‌రెడ్డి హాజరయ్యారు.

English summary
Rangareddy DCC Ex. President KM Pratap Joins in TRS Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X