9వ తరగతి అమ్మాయిని కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..
హయత్ నగర్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులకు స్థానికులు దేహశుద్ధి చేశారు.
హైదరాబాద్: హయత్ నగర్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులకు స్థానికులు దేహశుద్ధి చేశారు.

హైదరాబాదులోని హయత్ నగర్ ప్రాంతానికి చెందిన బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని చూసిన ఇద్దరు కారు డ్రైవర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు.
అప్పుడు వారిద్దరు మద్యం మత్తులో ఉన్నారు. నిందితులిద్దరిని శ్రీకాంత్, రమేష్‌లుగా గుర్తించారని తెలుస్తోంది. విషయం తెలిసిన స్థానికులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications