డీసీఎం వ్యానులో గర్భిణిపై అత్యాచారయత్నం, కిందకు దూకడంతో మృతి
మెదక్: డీసీఎం వ్యానులో ప్రయాణిస్తున్న ఏడునెలల గర్భవతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టడంతో వారి నుంచి ప్రాణాలు కాపాడేందుకు ఆమె వాహనం నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటు చేసుకుంది. గర్భవతి అని కూడా చూడకుండా దుండగులు దారుణంగా ప్రవర్తించారు.
వెనిజులాలో చెప్పుకోలేని బాధ, సెక్స్ సంక్షోభం!: పడక గదికి వెళ్లాలంటేనే భయం
తూప్రాన్ మండలం రావెళ్లి శివారులో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. రావెళ్లి పంచాయతీ పరిధి పోతరాజ్‌పల్లికి చెందిన ఉడే రేగొండ, కళావతి దంపతులు పాతదుస్తులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

శనివారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో దుస్తులు విక్రయించిన కళవతి రాత్రి పది గంటల సమయంలో తన పెద్ద కుమార్తె శిరీషను వెంటబెట్టుకొని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యానులో ఎక్కింది. ఆమె ముందు క్యాబిన్లో కూర్చుంది.
అందులో ఉన్న డ్రైవర్, మరో వ్యక్తి కళావతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అనంతరం అత్యాచారయత్నం చేశారు. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. దీంతో భయాందోళనకు గురైన కళావతి వాహనంలో నుంచి కిందకు దూకింది.
కొద్ది దూరం వెళ్లాక దుండకులు బాలికను, ఆమె పాత దుస్తుల మూటను కింద వదిలేసి వెళ్లిపోయారు. బాలిక తిరిగి తల్లి దూకిన చోటకు వచ్చి ఆమెను లేపే ప్రయత్నం చేసింది. కానీ ఆమె కదలకుండా పడి ఉండటంతో కొద్ది దూరంలో ఉన్న దాబా వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. వారు పేదవారు కావడంతో పోతరాజుపల్లి వాసులు తలా కొంత డబ్బులు ఇచ్చి అంత్యక్రియలు చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!