హైదరాబాద్ టిడిపి కార్యదర్శి వినోద్‌పై మరో అత్యాచార కేసు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శి అమరం వినోద్‌పై చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో మరో అత్యాచార కేసు నమోదైంది. ఈ మేరకు ఏసీపీ నర్సయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుటుంబ కలహాలతో ఓ జంట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో వారిని అమరం వినోద్ అతని అనుచరుడు గొల్ల రమేశ్ జవహార్‌నగర్‌లోని కార్యాలయానికి పిలిపించారు.
భర్త నుంచి రూ.10 లక్షలు ఇప్పిస్తామని.. విడాకులివ్వాలని ఆమెను ఒప్పించారు. అడ్వాన్సుగా రూ.50 వేలు ఇచ్చి పంపించారు. కొద్ది రోజుల తర్వాత మీ భర్త మరికొన్ని డబ్బులు ఇచ్చాడు వచ్చి తీసుకెళ్లాలని ఆమెను పిలిపించారు.

అనంతరం అమరం వినోద్‌తోపాటు అతని అనుచరులు రమేశ్, సురేశ్ ఆమెను చంపుతామని బెదిరించారు. అంతేగాక, తమతో మంచిగా ఉంటే డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. డబ్బులు ఇవ్వకపోగా రోజురోజుకు వారి వేధింపులు మితిమీరడంతో బాధితురాలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు ఉపసంహరించుకోమని బాధితురాలిని బెదిరించారంటూ టిడిపి గ్రేటర్ సెక్రటరీ జనరల్ ఎంఎన్ శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు. కాగా, ఆరు నెలల క్రితమే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో వినోద్‌పై నిర్భయ కేసు నమోదైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications