Ration Cards:రేషన్ కార్డు దారులకు బిగ్ షాక్, తాజా నిర్ణయంతో..ఇక..!!
రేషన్ కార్డుల విషయంలో పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త కార్డులను మంజూరు చేసింది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అర్హత ఉన్న వారికి కార్డులను మంజూరు చేసింది. ఇది నిరంతర ప్రక్రియగా మార్చి ప్రతీ అర్హుడికి కార్డు అందించాలని డిసైడ్ అయింది. కాగా, పలు ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ అధికారుల క్షేత్ర స్థాయి పర్యటనలో రేషన్ కార్డుల పైన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో, ఇప్పుడు సివిల్ సప్లయిస్ అధికారులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
రేషన్ వ్యవస్థను అర్హులకే అందేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేకుండా కొత్త కార్యాచరణ ఖరారు చేసింది. అదే విధంగా అర్హత లేకపోయినా రేషన్ కార్డులు ఉన్నవారిని గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పలు జిల్లాల్లో ఈ ఏరివేత ప్రక్రియ మొదలుపెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు భిన్నంగా రేషన్ కార్డులు ఉన్న వారిని గుర్తించి.. వారి కార్డులను తెలిగించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు వారి జాబితాలను సిద్దం చేస్తున్నారు. బోగస్ కార్డులను తెలిగించి.. అర్హత ఉండీ కార్డు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తున్న అధికారులు ప్రభుత్వంతో చర్చించిన తరువాత వీరి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

కొనసాగుతున్న కసరత్తు
కాగా, ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులు ఎవరో నిర్ణయించటంతో, వారికే కార్డులు ఉండాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు అనర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. క్షేత్ర స్థాయి పర్యటనలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు సైతం తెల్ల రేషన్ కార్డు పొందినట్లు గుర్తించారు. నాలుగు ఎకరాల పైబడి పొలం ఉన్న వారితో పాటుగా రూ రూ.8లక్షల ఆదాయం పొండటం.. ఐటీ చెల్లిస్తున్న వారిని ఈ విధంగా కార్డులు పొందిన వారిలో గుర్తించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో అర్హత లేకపోయినా కార్డులు పొంది బోగస్ కార్డులతో వైద్య సేవలతోపాటు పింఛన్లను తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. పౌరసరఫరాశాఖ అధికారులు గుర్తించిన పేర్ల జాబితాను అన్ని జిల్లాలకు పంపించారు. జాబితాలో ఉన్నవారి పేర్లు అర్హులా, అనర్హులా అనే విషయాన్ని గుర్తించాల్సి ఉంది.బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ ప్రభుత్వ నియమ నిబంధన ల మేరకు జరుగుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు వివరించారు. జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిశీలనలో తేలినవారిని మాత్రమే పరిగణన లోకి తీసుకుంటామని స్పష్టం చేసారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications