రైలు సూదిగాడు ఇతడే: ఘర్షణ, అరెస్ట్ (ఫోటోలు)
హైదరాబాద్: రైలులో సూదిగాడు ప్రయాణిస్తున్నాడంటూ పుకార్లకు ప్రయాణికులు వణికిపోయారు. తోటి ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తకు దారి తీసింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
చివరకు మతిస్థిమితం లేని యువకుడిగా నిర్ధారించి యువకుడిని మందలించి వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వస్తున్న భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శనివారం ఖాజీపేటకు చెందిన రవికుమార్ (40) ప్రయాణిస్తున్నాడు.

రైల్లో సూదిగాడంటూ పుకార్లు: ఘర్షణ, అరెస్ట్
తన పక్కన కుర్చున్న భువనగిరికి చెందిన నిశాంత్ రుమాలును రవికుమార్ తీసుకున్నాడు. ఎందుకు నా రుమాలు తీసుకున్నావని అతను రవికుమార్ అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణగా మారింది.

రైల్లో సూదిగాడంటూ పుకార్లు: ఘర్షణ, అరెస్ట్
భువనగిరి-బీబీనగర్ రైల్వే స్టేషన్ మధ్య రైల్లోనే వీరిద్దరూ కొట్టుకున్నారు. దీంతో రవికుమార్ తనకు ఇంజెక్షన్ (సూది) చూపించి పొడుస్తానని బెదిరించాడని నిశాంత్ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు తన సెల్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

రైల్లో సూదిగాడంటూ పుకార్లు: ఘర్షణ, అరెస్ట్
వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్న వెంటనే రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో రవికుమార్‌కు ఉబ్బసంతో బాధపడుతున్నాడని ఆ వ్యాధి అదుపునకు సూది తన వెంట తెచ్చుకున్నాడని తేల్చారు.

రైల్లో సూదిగాడంటూ పుకార్లు: ఘర్షణ, అరెస్ట్
అతనికి మతిస్థిమితం సరిగా లేదని నిర్ధారించుకొని మందలించి కుటుంబ సభ్యలకు అప్పగించారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.












Click it and Unblock the Notifications