కొత్త జంక్షన్లకు రవీంద్ర గుప్తాతో భేటీలో కెసిఆర్ సూచన: ఇక మిషన్ భగీరథ
హైదరాబాద్: సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగినందున నగర శివార్లలో కొత్త జంక్షన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు సూచించారు. శుక్రవారంనాడు సచివాలయంలో కెసిఆర్‌ను రవీంద్ర గుప్తా కలిశారు. నగర శివారులో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని సిఎం కోరారు.
ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని అన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి, ముంబై రూట్‌కు నాగులపల్లి జంక్షన్ అనుకూలంగా ఉంటాయని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రతిపాదనకు రవీంద్ర గుప్త సానుకూలంగా స్పందించారు. చర్లపల్లిలో ఉన్న రైల్వే శాఖ భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత భూమిని కేటాయించాలని జీఎం కోరగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పేదల గృహ నిర్మాణానికి, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలంలేదని, సికింద్రాబాద్‌లోని రైల్వే భూమిలో 15 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించాలని సీఎం కోరారు. అందుకు ప్రతిగా రైల్వే శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తామని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్‌లు 150 వరకు ఉన్నాయని తెలిపారు. అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని, నిరుడు మాసాయిపేట దుర్ఘటనలో విద్యార్థులు మరణించడం ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే దశలవారీగా గేట్లు ఏర్పాటు చేస్తామని జీఎం హామీ ఇచ్చారు. తుకారం గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి పనులను కూడా త్వరగా చేపట్టాలని సీఎం కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు రైల్వే జీఎం సానుకూలంగా
కాగా, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు మిషన్ బగీరథ అని నామకరణం చేయాలని కెసిఆర్ నిర్ణయించారు. ఇంటింటికీ మంచినీరు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద యెత్తున వాటర్ గ్రిడ్ ఏర్పాటును తలపెట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications