రాహుల్ సభ లేకుంటే: రేవంత్ ప్లాన్ ఇదీ! ఇరకాటంలో పెట్టాడనే టీడీపీ నేతపై ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్ కుంతియా శనివారం కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.

రాజీనామా: అన్నీ చేశారు కానీ, రేవంత్ తెలివిగా తప్పించుకుంటున్నారా?

రేవంత్ రెడ్డి ఇంటికి కుంతియా

రేవంత్ రెడ్డి ఇంటికి కుంతియా

తెలంగాణలోని రాజకీయాలు, రేవంత్‌ నియోజకవర్గం కొడంగల్‌లో జరుగుతున్న పరిణామాలు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వరంగల్‌ బహిరంగ సభ ఏర్పాట్ల పైన వారు చర్చించారు. సభను ఏ విధంగా విజయవంతం చేయాలనే అంశంపై మాట్లాడుకున్నారు.

రాహుల్ గాంధీ సభ లేకుంటే

రాహుల్ గాంధీ సభ లేకుంటే

అలాగే, ఒకవేళ రాహుల్‌ సభ లేకపోతే ఏం చేయాలనే విషయమై కూడా రేవంత్ రెడ్డి.. కుంతియాకు చెప్పారని తెలుస్తోంది. జిల్లాల వారీగా ఆత్మీయ సభలు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు రేవంత్‌ వివరించారని సమాచారం.

ఇలా చేద్దామని కుంతియాకు రేవంత్

ఇలా చేద్దామని కుంతియాకు రేవంత్

తర్వాత కుంతియా మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యమేమీ లేదన్నారు. తెలంగాణలో రాహుల్‌ పర్యటన ఇంకా ఖరారు కాలేదన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు.

తనను ఇరకాటంలో పెట్టినందుకే రమణపై ఆగ్రహం

తనను ఇరకాటంలో పెట్టినందుకే రమణపై ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రేవంత్ రెడ్డి టీడీపీపై విమర్శలు చేయడం లేదు. అయితే రెండు రోజుల క్రితం ఎల్ రమణ మాట్లాడుతూ.. రేవంత్ తన రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చానడంలో నిజం లేదని, ఆయన రాజీనామా సమర్పించలేదని చెప్పి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో రమణపై రేవంత్ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ సీఎం కేసీఆర్ ఉపాధి కూలి అని, బహిరంగ సభను కొడంగల్లో కాదని సిద్దిపేట, గజ్వెల్‌లో పెట్టాలని మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Telangana incharge RC Kuntiya has met Kodangal MLA Revanth Reddy at his residence on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి