Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Heat wave 2024: భానుడి భగభగ; 5రోజులు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు.. జాగ్రత్త

మండుతున్న ఎండలతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితులు బయటకు వెళ్లాలంటేనే భయాందోళన కలిగిస్తున్నాయి నల్గొండ, ఖమ్మం అంటే ప్రాంతాలలో అత్యధికంగా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది.

11 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యం
గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు బద్దలు కొడుతూ ఏప్రిల్ నెలలోనే నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచిస్తుంది. 11 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి కూడా జనాలు ఉదయం లేదా సాయంత్రం బయటకు వెళుతున్న పరిస్థితులు ఉన్నాయి.

Record breaking temperatures in Telangana heat waves alert in 13 districts IMD key update

ఈ జిల్లాలు రెడ్ జోన్ లో
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, జనగామ, పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వనపర్తి, గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్ లో ఉన్నాయని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఈ జిల్లాలను 46 డిగ్రీలు, ఆపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణాలోని 13 జిల్లాలలో తీవ్రమైన వడగాలులు
ఇక రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణాలోని 13 జిల్లాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని అంటున్నారు. హనమకొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, వరంగల్, వనపర్తి, గద్వాల్, నారాయణ పేట్,నాగర్ కర్నూల్ జిల్లాలలో తీవ్ర వడగాలుల ప్రమాదం ఉందన్నారు.

నల్గొండలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6డిగ్రీలఉష్ణోగ్రత
ఇక ఇదే సమయంలో దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మే ఆరవ తేదీ వరకు పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లాలో వరుసగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జిల్లాలోని చండూరు, మునుగోడు మండలాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలు, వడగాలుల దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఉదయం 8గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో పాటు వడగాల్పులు వీస్తుండటం తో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు... కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగి పోవడంతో రాతి వేళల్లో కూడా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+