వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోగుల బంధువులు రోడ్ల మీద, పార్కుల్లో ఉండాల్సినవసరం లేదు.!షెల్టర్లు నిర్మించిన జీహెచ్ఎంసీ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : విశ్వ నగరం దిశగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరం అందుకు తగ్గట్టుగానే మౌళిక సదుపాయాల కల్పనకోసం కృషిచేస్తోంది. అంతే కాకుండా అనేక ప్రాంతాలనుండి వివిధ కారణాలతో వేర్వేరు ఆసుపత్రులకు చికిత్సనిమిత్తం వచ్చే రోగులకు, వారికి సంరక్షకులుగా వచ్చే వారు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది నగర పాలక సంస్ధ. వివిద ఆసుపత్రులకు చికిత్సకోసం వస్తున్న రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకుంటారు గానీ వారిని సంరక్షించేందుకు వచ్చిన వారిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. వారు రోడ్ల పక్కర ఫుట్ పాత్ ల మీదనో, పార్కులలోనో, బస్ షెల్టర్లలోనో తల దాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇలాంటి పరిస్ధితులకు చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తోంది.

రోగులతో పాటు సంరక్షకులుగా వచ్చే వారికి బస.. అన్ని సౌకర్యాలతో భవంతుల నిర్మాణం

రోగులతో పాటు సంరక్షకులుగా వచ్చే వారికి బస.. అన్ని సౌకర్యాలతో భవంతుల నిర్మాణం

రోగులతో పాటు సంరక్షకులుగా వస్తున్న వారు ఇక మీదట రోడ్లపైన ఉంగాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంటి వాతావరణంలో ఉండొచ్చు. రోగులతో వచ్చే సంరక్షకుల కోసం నగర పాలక సంస్థ అన్ని వసతులతో గెస్టు రూములను నిర్మిస్తోంది. విశాలమైన భవంతులను నిర్మించి అందులో రూములను రోగులతో వచ్చిన సంరక్షకులకు అద్దెకు ఇస్తారు. దీంతో ఎన్ని రోజులు పేషెంట్ చికిత్స జరిగితే అన్ని రోజులు ఆ రూముల్లో ఉండే విధంగా నగర పాలక సంస్థ ఏర్పాట్లను చేస్తోంది. ప్రధాన ఆసుపత్రుల వద్ద ఈ నిర్మాణాలను చేపట్టింది నగర పాలక సంస్థ.

రోడ్ల మీద పడిగాపులకు చెక్.. రోగి బంధువుల కోసం వసతులతో కూడిన బస

రోడ్ల మీద పడిగాపులకు చెక్.. రోగి బంధువుల కోసం వసతులతో కూడిన బస

వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు, అత్యవసర చికిత్స కొరకు హైదరాబద్ లో గల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం రాష్ట్ర నలుమూలల నుండి వస్తుండడం జరుగుతుంది. ఆర్థిక స్తోమత లేక నిరుపేదలు ప్రవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తారు.
చికిత్స కోసం రోగితో పాటుగా కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో నైట్ షెల్టర్లు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ కు చికిత్స కోసం వచ్చిన వారికి జిహెచ్ఎంసి ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.

సుమారు 11కోట్లతో 7 షెల్టర్ల నిర్మాణం.. ప్రధాన అసుపత్రుల వద్ద నిర్మాణాలు

సుమారు 11కోట్లతో 7 షెల్టర్ల నిర్మాణం.. ప్రధాన అసుపత్రుల వద్ద నిర్మాణాలు

ఇందులో భాగంగా 10.68 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 నైట్ షెల్టర్ నిర్మాణ పనులను చేపట్టారు జీహెచ్ఎంసీ అదికారులు. ఈఎన్టి ఆసుపత్రిలో 2.90కోట్ల రపాయల వ్యయంతో, ఉస్మానియ జనరల్ ఆసుపత్రి వద్ద 3.37కోట్ల రూపాయల వ్యయంతో, మహావీర్ ఆసుపత్రిలో 95 లక్షల రూపాయల వ్యయంతో, నిలోఫర్ ఆసుపత్రి వద్ద 2.60కోట్ల రూపాయల వ్యయం తో, కోటి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద 1.96కోట్ల రూపాయలతో, నిమ్స్ ఆసుపత్రి వద్ద 3.10 కోట్ల రూపాయలతో, నాంపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద 1కోటి రూపాయల వ్యయంతో నైట్ షెల్టర్ భవంతులను నిర్మించినట్టు తెలుస్తోంది.

రోగి బందువుల కష్టాలకు చెక్.. వినూత్న ప్రణాళిక రచించిన జీహెచ్ఎంసీ

రోగి బందువుల కష్టాలకు చెక్.. వినూత్న ప్రణాళిక రచించిన జీహెచ్ఎంసీ

ఈ వసతి భవంతుల నిర్వహణను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి అప్పజెప్పడం జరిగిందని అధికారులు చెప్పుకొస్తున్నారు. నైట్ షెల్టర్ల లో వచ్చే పేషెంట్లకు వారి సహాయకులు కనీస అవసరాలు తీర్చుకునే విధంగా వసతులను కల్పించారని తెలుస్తోంది. ఈ ఎన్ టి ఆసుపత్రిలో మహిళలకు పురుషులకు కలిసి మొత్తం108మందికి వసతి కల్పిస్తారు. అదేవిధంగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి లో 126మందికి, మహావీర్ లో 76మందికి నిలోఫర్ లో 192మందికి, కోటి మెటర్నిటీ ఆసుపత్రి లో 160మందికి, నిమ్స్ లో 115, నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో 100 మందికి మొత్తం సుమారు 900మందికి షెల్టర్ లో అవకాశం ఉంటుంది. జి హెచ్ ఎం.సి యు సి డీ విభాగం అధ్వర్యంలో ఆయా సర్కిల్ మరో 14 నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేసారు.

English summary
Steps have been taken to build night shelters in major government hospitals. GHMC is setting up special facilities for those who come to Hyderabad for treatment from different places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X