హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెస్ట్ ఆఫర్: అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లు , బెస్ట్ డీల్స్ ను ప్రకటించనున్న జియో

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.అయితే తమ కస్టమర్లు ఇతర కంపెనీల వైపుకు వెళ్ళిపోకుండా ఉండేందుకుగాను ఈ రకమైన ఆపర్లను ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నాయి.అయితే ఏద

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్లో మార్పులు చేర్పులు చేస్తూ నిర్ణయాన్ని తీసుకొన్నాయి. ఈ నేపథ్యంలో బెస్ట్ డీల్స్ ను ప్రకటించేందుకు జియో కూడ సన్నద్దమౌతోంది.

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలు తమ టారిఫ్ లను మార్చులు చేర్పులు చేశాయి. ఉచిత ఆఫర్లకు తాము కూడ సిద్దంగా ఉన్నామని ప్రకటించాయి.

ఎయిర్ టెల్ , వొడాపోన్, ఐడియా కంపెనీలు తమ టారిఫ్ లలో మార్పులు చేశాయి.ఈ మార్పుల ద్వారా జియో వైపుకు తమ కస్టమర్లను మళ్ళకుండా ఆయా టెలికం కంపెనీలు జాగ్రత్తలు తీసుకొన్నాయి.

అయితే ఇతర టెలికం కంపెనీలు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలను దృష్టిలో ఉంచుకొని బెస్ట్ డీల్స్ ను ప్రకటించనుంది రిలయన్స్ జియో.

ఎయిర్ టెల్ రూ.345 రీచార్జ్ ప్యాక్

ఎయిర్ టెల్ రూ.345 రీచార్జ్ ప్యాక్

రూ.345 రీ చార్జ్ చేసుకొనే ఎయిర్ టెల్ ఫ్రీపెయిడ్ కస్టమర్లు 28 రోజల వరకు 28 జీబీ హై స్పీడ్ డేటాను వాడుకోవచ్చు.అదే విధంగా డైలీ ఎఫ్ యూపి కింద 1జీబీ డేటాను అదనంగా పొందవచ్చు.రోజంతా 500 ఎంబిని వాడుకొని, అర్థరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు మరో 500 ఎంబిని వాడుకొనేలా ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ను అందిస్తోంది.ఒకవేళ ఎలాంటి టైమింగ్ నిబంధనలు లేకుండా రోజంతా 1 జీబీ డేటాను వాడుకోవాలనుకొనేవారు రూ.549 రీచార్జ్ ప్యాక్ ను వేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత కాల్స్ ను ఇస్తోన్న ఎయిర్ టెల్

ఉచిత కాల్స్ ను ఇస్తోన్న ఎయిర్ టెల్

రూ.345 , రూ.549 ప్యాక్ లపై ఉచిత కాల్స్ ను కూడ పొందే అవకాశం ఉంది. కానీ , షరతులు వర్తిస్తాయి.1200 నిమిసాలకు పైగా కాల్స్ ను వాడుకొనే వారికి నిమిషానికి 30 పైసల చార్జీ పడుతోంది. చార్జీ వేసిన తర్వాత ఎయిర్ టెల్ రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్ ను అందిస్తోంది. అటు పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఎయిర్ టెల్ మార్చి 13 నుండి ఉచిత డేటా అందించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కానీ, ఎంత మేరకు ఉచిత డేటా అందిస్తోందో తెలుపలేదు. అయితే ఈ ఉచిత డేటాను పొందాలంటే మై ఎయిర్ టెల్ యాప్ ను సబ్ స్క్రైబర్లు ఓపేన్ చేసుకోవాలని ఎయిర్ టెల్ సూచిస్తోంది.

వొడాఫాన్ రూ.348 రీచార్జీ ప్యాక్

వొడాఫాన్ రూ.348 రీచార్జీ ప్యాక్

రూ.346 రీచార్జీ ప్యాక్ ను లాంచ్ చేసిన వొడాఫోన్ 28 జీబీ మొబైల్ డేటాను అపరిమిత ఉచిత కాల్స్ ను అందించనున్నట్టు సమాచారం. ఇతర పోటీ కంపెనీల మాధిరిగానే రోజూ 1 జీబీ ఉచిత డేటాను వాడుకొనే అవకాశం కల్పించిన వొడాఫోన్ అంతకంటే ఎక్కువ వాడితే చార్జీ చేయనుంది.

రిలయన్స్ జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రూ.300 రీచార్జ్ ప్యాక్

రిలయన్స్ జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రూ.300 రీచార్జ్ ప్యాక్

రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు రూ.300 ప్రీపెయిడ్ రీ చార్జ్ తో 28 జీబీ 4 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ డేటాను 28 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. జియో ప్రైమ్ పోస్టు పెయిడ్ యూజర్లు ఇదే థర కింద 30 జీబీ డేటాను కంపెనీ అందించనుంది. ఈ ప్లాన్ కింద కస్టమర్లు రూ.99 జియో ప్రైమ్ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకొంటే రోజుకు 1 జీబీ డేటా సరిపోదనుకొంటే ప్రీపెయిడ్ యూజర్లు రూ.499 జియో ప్రైమ్ రీ చార్జ్ ప్యాక్ వేసుకొంటే అదనంగా 56 జీబీ డేటాను పొందే అవకాశం ఉంది.రోజుకు 2 జీబీ వాడుకోవచ్చు. ఇదే బిల్లింగ్ సైకిల్ కింద పోస్ట్ పెయిడ్ కస్టమర్లైతే 60 జీబీ డేటాను కూడ పొందవచ్చు.

ఐడియా రూ.348 రీచార్జ్ ప్యాక్

ఐడియా రూ.348 రీచార్జ్ ప్యాక్

ఐడియా ప్రీ పెయిడ్ కస్టమర్లు కూడ. రూ.346 రీచార్జ్ తో 14 జీబీ ఉచిత డేటాను రోజుకు 500 ఎంబీ డేటాను వాడుకొనే అవకాశం ఉంది. వీటితో పాటు అపరిమిత కాల్స్ ను పొందే అవకాశం ఉంది. 4జీ సెల్ ఫోన్ ఉన్న వారికి మాత్రమే ఈ కొత్త ఆఫర్ సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉంది.

English summary
With the entry of Reliance Jio in the market, Airtel, Vodafone and Idea Cellular have an uphill battle to remain competitive in the face of the new operator's free calls, 4G data, and other services. With the free Jio services finally set to end on March 31, customers can either disconnect their Jio numbers or switch to Jio Prime plans, which allow the Mukesh Ambani-backed telecom operator to provide 4G data and bundled apps at ultra-low prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X