వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్‌ ఫలితాలపై నివేదిక సమర్పణ..! గ్లోబరీనా సాఫ్ట్ వేర్ పరిశీలించనున్న అదికారులు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇంటర్‌ ఫలితాలపై నివేదిక సమర్పణ..! || Oneindia Telugu

హైదరాబాద్‌ : ఇంటర్ లో చెలరేగిన అస్థిరతకు ఇప్పుడిప్పుడే బ్రేకులు పడబోతున్నాయి. ఇంటర్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై ఎట్టకేలకు నివేదికను త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లిన అంశంపై నివేదిక కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ పరిశీలనకు ఈ కమిటీని 22న నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణ చేపట్టి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఇంటర్ అవకతవకలపై నివేదిక..! చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం..!!

ఇంటర్ అవకతవకలపై నివేదిక..! చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం..!!

అయితే నివేదిక సమర్పణలో జాప్యం నెలకొంది. ఈ నెల 25నే నివేదికను సిద్ధం చేసిన కమిటీ.. శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శికి అందజేయాలని భావించింది. అయితే విద్యాశాఖ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో నివేదికను శనివారం అందజేసింది. ప్రధానంగా ఇంటర్‌ ఫలితాల్లో ఇంత గందరగోళం ఎందుకు తలెత్తింది... లోపాలు ఎక్కడ చోటుచేసుకున్నాయనే అంశాలను నివేదికలో ప్రస్తావించింది.

గ్లోబరీనా సాఫ్ట్ వేర్ పరిశీలన..! లోపాలను పసిగట్టే పనిలో త్రిసభ్య కమిటీ..!!

గ్లోబరీనా సాఫ్ట్ వేర్ పరిశీలన..! లోపాలను పసిగట్టే పనిలో త్రిసభ్య కమిటీ..!!

అటు ఇంటర్‌ బోర్డు వైఫల్యాలతోపాటు గ్లోబరీనా సంస్థలో ఉన్న లోపాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఇదే సమయంలో విద్యార్థులకు నష్టం కలగకుండా తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ ప్రతిపాదించింది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు..! విద్యార్థులకు కాస్త ఊరట..!!

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు..! విద్యార్థులకు కాస్త ఊరట..!!

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు ఫీజు గడువును మరో రెండు రోజులపాటు ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. తొలుత ఈ నెల 27 వరకు దరఖాస్తు గడువు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు పునఃపరిశీలన ఫలితాల కోసం వేచి చూడకుండా.. సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.

మళ్లి విద్యార్థుల్లో హాడావిడి..! ప్రపేర్ అవుతున్న ఇంటర్ కుర్రాళ్లు..!!

మళ్లి విద్యార్థుల్లో హాడావిడి..! ప్రపేర్ అవుతున్న ఇంటర్ కుర్రాళ్లు..!!

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆయా సబ్జెక్టులకు ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, పునఃమూల్యాంకనం చేయించుకొనేందుకు దరఖాస్తు గడువు కూడా రేపటితోనే (ఏప్రిల్‌ 27) ముగియనుంది. ఫెయిలైన సబ్జెక్టులకు మాత్రమే ఉచితంగా రీవెరిఫికేషన్ ఉంటుందని.. పాసైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించాల్సిందేనని బోర్డు పేర్కొంది. దీంతో ఇంటర్ విద్యార్థుల ఉరుకులు పరుగులు మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది.

English summary
Finally,the Third Committee submitted the report to the Government on the confusion in the inter-related results.The government has appointed a three-member committee to report on the mistakes made in the inter results. The decision was taken by the government to consider the committee's decision to consider Globerina Technologies company software.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X