వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిపబ్లిక్ డే: జెండా ఎగురవేసిన కలెక్టర్‌ ఆమ్రపాలి(పిక్చర్స్)

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకు గురువారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 68వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకు గురువారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట నూతనంగా ఏర్పడిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మొదటిసారిగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండా వందనం గావించి అనంతరం జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు.

 వీరులకు సన్మానం

వీరులకు సన్మానం

అంతకు ముందు జిల్లా కలెక్టర్‌ అనుమతితో కమాండర్‌ వి శ్రీనివాస్‌ సారధ్యంలో మార్చి పరేడ్‌లో ఆరు కంపెనీ ప్లాటూన్లు పాల్గొని పరేడ్‌ నిర్వహించారు. ఇందులో జి. వేణు, ఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సి.ఎ.ఆర్‌. ప్లాటూన్‌, యం. శివకేశవు, ఆర్‌ఎస్‌ఐ ఆధ్వర్యంలోని పిఎస్‌ఓ ప్లాటూన్‌, ఇ. చంద్రశేఖర్‌, ఆర్‌ఎస్‌ఐ నేతృత్వంలోని హోమ్‌ గార్డ్స్‌ ప్లాటూన్‌, ఎ. నాగరాజ్‌ ఆధ్వర్యంలో ఎన్‌సిసి బాుర ప్లాటూన్‌ మరియు ఎన్‌. అశ్విని నేతృత్వంలో ఎన్‌సిసి బాలిక ప్లాటూన్‌లు పాల్గొన్నాయి. ఈ పరేడ్‌ను జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట, సి.పి. సుధీర్‌బాబుతో కలిసి పరిశీలించారు. పరేడ్‌లో భాగంగా బ్యాండ్‌ బృందం యం.డి. అంకుషావలి నేతృత్వంలో పాల్గొంది.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా జిల్లా విద్యాశాఖ సమాచార పౌరసంబంధా శాఖ సమన్వయంతో పాఠశాల విద్యార్థినీ విద్యార్థుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతును విశేషంగా అరించాయి. ముఖ్యంగా తెంగాణలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయా వేషధారణతో తేజస్వి హై స్కూల్‌కు చెందిన 120 మంది విద్యార్థినీ విద్యార్థు ‘మాది తెంగాణ జాతి' అంటూ చేసిన నృత్య ప్రదర్శన వేడుకకు హాజరైన వారిని విశేషంగా అరించింది.

అలరించాయి

అలరించాయి

అలాగే మల్లికాంబ మనోవికాస కేంద్రం నుండి వచ్చిన 55 మంది దివ్యాంగులు ‘జన గణ మన, వందేమాతరం' జాతీయ గీతాలకు చేసిన నృత్య ప్రదర్శన, ప్రధానమంత్రి ఇచ్చిన నినాదం ‘బేటి బచావో ` బేటి పడావో'పై గ్రీన్‌వుడ్‌ హై స్కూల్‌కు చెందిన వంద మంది విద్యార్థిను చేసిన నృత్య ప్రదర్శను కూడా ఆహుతును ఆకట్టుకున్నాయి.

జెండా ఎగరేసిన కలెక్టర్

జెండా ఎగరేసిన కలెక్టర్

అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి చేపట్టిన హరితహారం కార్యక్రమంపై ప్రభుత్వ మర్కజి హైస్కూల్‌కు చెందిన 160 మంది విద్యార్థినీ విద్యార్థులు ‘నాలుగు కోట్ల చేతులొక్కటై మొక్కలు నాటాదామా' అనే పాటతో చేసి నృత్య ప్రదర్శన, జాతీయ జెండాపై సెయింట్‌ పీటర్స్‌ సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 110 మంది విద్యార్థినీ విద్యార్థులు ‘ఎందరెందరో పుణ్య పురుషులు ఆత్మార్పణమే ఈ జెండా' అంటూ చేసిన నృత్య ప్రదర్శన హాజరైన వారిని అరించింది.

స్వాతంత్ర్య సమరయోధులకు సత్కారం

స్వాతంత్ర్య సమరయోధులకు సత్కారం

వేడుకలో భాగంగా హాజరైన దేశ స్వాతంత్య్ర సమారయోధులను సన్మానించిన కలెక్టర్.. వివిధ శాఖలో ఉత్తమ పనితీరు చూపిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

English summary
Warangal Collector Amrapali Hoists National Flag at Police Parade Ground on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X