హెరిటేజ్ జీతగాడిగా: రేవంత్‌పై తెరాస ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి హెరిటేజ్ జీతగాడుగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వేముల రమేష్, వీరేశంలు అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడారు. రేవంత్ సభ జరగకుండా అడ్డుపడ్డాడన్నారు. చంద్రబాబు కల్తీ పాల సంస్థ హెరిటేజ్ జీతగాడిగా, ఆయన తొత్తుగా మాట్లాడుతున్నారన్నారు.
ప్రభుత్వం ప్రతిపక్షాల వాదనలు వినడానికి ప్రయత్నిస్తుంటే రేవంత్ లాంటి వాళ్లు రాద్దాందతం చేస్తున్నారన్నారు. రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. ఆయన తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారారన్నారు.

సభలో...
రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. రేవంత్ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళా పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పైన ఆయన చేసిన ఆరోపణల పైన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ క్షమాపణ చెప్పి ఉంటే సస్పెన్షన్ వేటు పడి ఉండేది కాదన్నారు.
జై తెలంగాణ నినాదాలు చేసినందుకు తమను సభ నుండి ఎన్నోసార్లు సస్పెండ్ చేశారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం అన్నారు. తమ పార్టీ సభ్యులు ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు జైలుకెళ్లామన్నారు. రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేశామన్నారు. పదవులను తృణపాయంగా వదిలేశామన్నారు.












Click it and Unblock the Notifications