పండుగ చేసుకునే వార్త: వారి ఖాతాల్లో ఉచితంగా లక్ష రూపాయలు.. తులం బంగారం కూడా!!

తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఓ పథకం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధులను కూడా మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామందికి సంతోషం కలుగుతుంది. అసలు ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? దేనికి సంబంధించి నిధులను మంజూరు చేసింది? దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలలోకి వెళితే..

725 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం తాజాగా కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ పథకానికి నిధులను మంజూరు చేసింది. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి 725 కోట్ల రూపాయలకు అనుమతినిచ్చింది ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుద్ధ వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీ అయిన కళ్యాణ లక్ష్మి, తులం బంగారం స్కీంను అమలు చేయాలని నిర్ణయించింది.

Revanth govt good news one lakh cash and one tula gold in to beneficiary accounts

గత ఎన్నికల ముందు ఆర్ధిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామన్న సర్కార్
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేసింది. ఇక ఈ హామీని అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశం మీద సుదీర్ఘంగా కసరత్తు చేసిన కాంగ్రెస్ సర్కార్ మొత్తం 725 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దీనివల్ల లబ్ధిదారులకు డబ్బుతో పాటు బంగారం కూడా లభించనుంది.

తెలంగాణాలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చటమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది.

త్వరలోనే లబ్దిదారులకు గుడ్ న్యూస్
అంతే కాదు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి గూడు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజాగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసి ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారాన్ని ఉచితంగా లబ్ధిదారులకు అందించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+