తగ్గిన రేవంత్: టీడీపీఎల్పీ భేటీ రద్దు అందుకే, ఐనా వేటుకు ముమ్మరయత్నాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కాస్తా తగ్గినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నిర్వహించతలపెట్టిన టీడీఎల్పీ సమావేశాన్ని రద్దు చేసినట్లు రేవంత్ ప్రకటించారు.

 తగ్గిన రేవంత్..

తగ్గిన రేవంత్..

రేవంత్ రెడ్డి సహచరుల సూచన మేరకు టీడీఎల్పీ సమావేశాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా టీడీఎల్పీ సమావేశం అవసరం లేదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 వెంట వచ్చేదెవరు?

వెంట వచ్చేదెవరు?

ఒక వేళ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యేలైన సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్యలు సమావేశానికి వచ్చే అవకాశం కూడా లేకపోవడం రేవంత్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో ఎవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో రేవంత్ తగ్గినట్లు తెలుస్తోంది. అంతేగాక, గొడవను పెద్దది చేయడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

టీడీపీ-బీజేపీ భేటీకి రాలేనని రేవంత్

టీడీపీ-బీజేపీ భేటీకి రాలేనని రేవంత్

ఇది ఇలా ఉండగా, గురువారం మధ్యాహ్నం గోల్కొండ హోటల్లో టీడీపీ-బీజేపీ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎల్ రమణతోపాటు టీటీడీపీ నేతలు, బీజేపీ రాష్ట్ర నేతలు ప్రస్తుత పరిణామాలపై చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశానికి హాజరుకావడం లేదని రేవంత్ రెడ్డి ప్రకటించడం గమనార్హం.

 రేవంత్‌పై ముమ్మర యత్నాలు

రేవంత్‌పై ముమ్మర యత్నాలు

ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి తప్పించే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రేవంత్‌ను ముందే పక్కన పెట్టాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలు ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాసినట్లు తెలిసింది.

 ఇంకా ఎందుకు?

ఇంకా ఎందుకు?

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైన నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడైన ఎల్ రమణ తోపాటు సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్, తదితర వారు రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విన్నవించినట్లు తెలిసింది.

రేవంత్ కంటే ముందే బాబును కలవాలి..

రేవంత్ కంటే ముందే బాబును కలవాలి..

విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు వచ్చిన వెంటనే టీటీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. రేవంత్ కూడా చంద్రబాబును కలిసే అన్నీ చెబుతానని అంటున్న నేపథ్యంలో ఆయన కంటే ముందే తమ వాదన వినిపించాలని ఎల్ రమణ, మోత్కుపల్లి,క తదితర నేతలు భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Telangana president L Ramana on Wednesday announced that party National President N Chandrababu Naidu has directed Revanth Reddy to take up any programmes as the TDP Telangana working president.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి