రేవంత్ రెడ్డి ఇష్యూ: ఆ మొత్తం డబ్బుపై ఐటీ ఆరా

హైదరాబాద్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగవచ్చునని చెబుతున్నారు. రేవంత్ తెచ్చిన రూ.50 లక్షల పైన ఐటీ శాఖ ఆరా తీస్తోంది.

డబ్బు వివరాల పైన ఏసీబీ అధికారులతో ఐటీ శాఖ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. రూ.5 కోట్ల వ్యవహారం పైన కూడా ఆ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

 Revanth issue: IT enquairing about Rs.50 lakh

వైసీపీ, తెరాస ముగుసు తొలగిపోయింది: టీడీపీ

రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెరాస, వైసీపీ ముసుగులు తొలగిపోయాయని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. ఏకే ఖాన్ మీడియాలో ప్రకటించేలోపే వీడియోలు ఎలా లీకయ్యాయో చెప్పాలన్నారు. దీనిని బట్టి ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందాలు స్పష్టమయ్యాయని చెప్పారు.

అప్పులు తీర్చడం కోసం కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవంర కృష్ణారావు తెరాసలో చేరారని ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస రూ.200 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేసిన సంభాషణలను తాను బయటపెడతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+