సీనియర్లు ఒప్పుకొన్న కారణమిదేనా,రేవంత్‌కు కాంగ్రెస్‌కు మధ్యవర్తి జైపాల్‌?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాజీ కేంద్ర మంత్రి పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను ఒప్పించడంతో పాటు రాహూల్‌గాంధీతో రేవంత్‌ సమావేశమయ్యేలా జైపాల్‌రెడ్డి వ్యూహరచన చేశారంటున్నారు.అయితే రేవంత్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియదని జైపాల్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. అంతేకాదు పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామని జైపాల్ రెడ్డి ప్రకటించారు.

  News Roundup న్యూస్ రౌండప్ : లేటెస్ట్ అప్‌డేట్స్‌

  రేవంత్‌ దెబ్బ: 'శత్రువులెవరో, మిత్రులెవరో చెప్పలేం, స్వంత పనంటూ ఢిల్లీకి'

  తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం తనపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు.

  రేవంత్‌ వెనుక కాంగ్రెస్ సీనియర్లు: డికె అరుణతో చర్చలు, కోమటిరెడ్డి బ్రదర్స్ డైలమా?

  రేవంత్‌రెడ్డి వైఖరి టిడిపి నేతలకు మింగుడుపడడం లేదు. రేవంత్ వైఖరి అస్పష్టంగా ఉందని టిడిపి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఆ పార్టీకి చెందిన నేతలు ప్రకటించడం గమనార్హం.

  బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!

  ఈ పరిణామాలన్నీ తెలంగాణ టిడిపిలో గందరగోళం నెలకొంది.రేవంత్ వెంట ఎవరు పార్టీని వీడుతారనే విషయమై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు నేతలు పార్టీలోనే ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు.

  రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

  జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

  జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ... రేవంత్ విషయంలో చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసేలా జైపాల్‌ వ్యూహన్ని రచించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రాహూల్‌గాంధీతో రేవంత్ సమావేశమయ్యేలా జైపాల్ ఏర్పాటు చేశారని అంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కూడ జైపాల్‌రెడ్డి .... రేవంత్‌రెడ్డి టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పించారని సమాచారం.

  పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామన్న జైపాల్

  పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామన్న జైపాల్

  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారనే ప్రచారంపై ఇటీవల మీడియా ప్రతినిధులు జైపాల్‌రెడ్డిని ప్రశ్నిస్తే ఆయన కూడ సానుకూల సంకేతాలు పంపారు. రేవంత్‌ పార్టీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్న విషయం తనకు తెలియదన్నారు. అయితే జైపాల్‌రెడ్డి వ్యూహత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  కెసిఆర్‌ను ఢీకొట్టేందుకు రేవంత్‌‌ను కోరుకొన్నారా?

  కెసిఆర్‌ను ఢీకొట్టేందుకు రేవంత్‌‌ను కోరుకొన్నారా?

  తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రయోజనంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించి ఉంటుందంటున్నారు. పొత్తుల వ్యవహరంలో పార్టీ నాయకత్వం తీరుతో విభేధించిన రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగా కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారని అంటున్నారు. అయితే రోగి కోరుకొన్నది, వైద్యుడు ఇచ్చిన మాత్ర ఒక్కటే అనే చందంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ నాయకత్వం కూడ సానుకూల సంకేతాలు పంపిందంటున్నారు.రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరడంతో టిఆర్ఎస్‌ను బలంగా ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  సీఎం పీఠమే రేవంత్ లక్ష్యం

  సీఎం పీఠమే రేవంత్ లక్ష్యం

  ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలని రేవంత్‌రెడ్డి చిరకాల వాంఛ. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే అత్యున్నతస్థాయికి ఎదిగారు. జడ్‌పిటిసి నుండి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడ అనతికాలంలోనే దక్కించుకొన్నారు.రాజకీయంగా అత్యున్నత పదవులను ఇచ్చిన టిడిపిలో సీఎం పీఠం దక్కేలా లేదు. మరోవైపు టిఆర్ఎస్‌తో పొత్తుకు టిడిపి నాయకత్వం మొగ్గుచూపడంతో కాంగ్రెస్ పార్టీని రేవంత్ ఎంచుకొన్నారని సమాచారం. సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారనే ప్రచారం సాగుతోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jaipal Reddy who is the brother of Revanth Reddy's Father-in-Law responded on the speculations. 'I have no information about it! It's up to party high command to decide who should be inducted into the party. We would abide by the orders of the high command. I will always be supportive of decisions which gonna benefit the party'.But there is spreading rumour jaipal Reddy known Revath Reddy moment to congress.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి