దేవేందర్‌తో రేవంత్ మంతనాలు ? అందుకోసమేనా ?
హైదరాబాద్ : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పడు ఎడమొహం, పెడమొహంగా ఉండే నేతలు ఆప్యాయ పలకరింపులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్‌రెడ్డి అభిప్రాయభేదాలు మరచి .. అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు.
దేవేందర్ గౌడ్ మంతనాలు
శనివారం టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌తో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఇదివరకు వీరిద్దరూ టీడీపీలో కలిసి పనిచేశారు. ప్రస్తుతం రేవంత్, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. తన విజయం కోసం నేతల మద్దతు కూడగట్టడంలో బీజీగా ఉన్నారాయన. ఈ క్రమంలోనే ఇవాళ దేవందర్ గౌడ్ ను కలిసి .. తనకు మద్దతు తెలుపాలని కోరినట్టు తెలుస్తోంది.

మద్దతుతో గెలుపు సునాయసం
వివిధ పార్టీ పెద్దల మద్దతు తీసుకుంటే .. టీఆర్ఎస్ పార్టీని ఓడించడం సులువవుతోందన్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే దేవేందర్ గౌడ్ ను కలిసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను కూడా కలిసినట్టు పేర్కొన్నారాయన.
అంతా సానుకూలమే ..
లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు కోసం కలిసిన నేతలంతా తనకు మద్దతు తెలిపినట్టు రేవంత్ పేర్కొన్నారు. వీరి మద్దతు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురేస్తానని ధీమా వ్యక్తం చేశారు రేవంత్.












Click it and Unblock the Notifications