రేవంత్ భారీ స్కెచ్, కేసీఆర్‌కు తొలిదెబ్బ, టీఆర్ఎస్ ఆందోళన!: టచ్‌లో నాయకులు

Posted By:
Subscribe to Oneindia Telugu
  ఆత్మీయుల మాట..ముచ్చట.. : కెసిఆర్ ని బండ బూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి | Oneindia Telugu

  హైదరాబాద్/న్యూఢిల్లీ: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్‌ను దెబ్బతీస్తారని ప్రకటించిన కొద్ది గంటలకే పాలమూరు జిల్లాలో కేసీఆర్‌కు తొలి షాక్ తగిలింది. ఇప్పటికే వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత దొమ్మాటి సాంబయ్య.. రేవంత్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

  ఢిల్లీకి చేరిన రేవంత్, అనుచరుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు, హుటాహుటిన సీతక్క

   కేసీఆర్‌కు గట్టి షాక్, రేవంత్ గ్రూప్‌లోకి జెడ్పీటీసీ

  కేసీఆర్‌కు గట్టి షాక్, రేవంత్ గ్రూప్‌లోకి జెడ్పీటీసీ

  ఇప్పుడు ఊహించనిరీతిలో పాలమూరు జిల్లాలోను టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. రేవంత్ వెంట ముందుగా టిడిపికి చెందిన నాయకులు పాలమూరు జిల్లా నుండి వెళ్తారని ఊహించారు. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన హన్వాడ జడ్పీటిసి నారాయణమ్మతో పాటు ఆమె తనయుడు సురేందర్ రెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సోమవారం రేవంత్ గూటికి చేరారు.

   మేమంతా రేవంత్ వెంటే.. ప్రకటన

  మేమంతా రేవంత్ వెంటే.. ప్రకటన

  మంగళవారం రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఆయన వెంట నారాయణమ్మ ఆమె తనయుడు సురేందర్ రెడ్డి, వీరి అనుచరులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

   రేవంత్ రెడ్డి స్కెచ్

  రేవంత్ రెడ్డి స్కెచ్

  పాలమూరు జిల్లా నుంచి చాలామంది నేతలను తన దారికి తెచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగా స్కెచ్‌లో పాలమూరు జిల్లాకు చెందిన చాలామంది నాయకులు రేవంత్‌తో కలిసి నడిచే అవకాశాలున్నాయని అంటున్నారు.

   రేవంత్ రెడ్డితో టచ్‌లో వారు

  రేవంత్ రెడ్డితో టచ్‌లో వారు

  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలువురు నేతలు రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరుగురు జెడ్పీటీసీలు, నలుగురు ఎంపీపీలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

   పాలమూరులో టీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు స్కెచ్

  పాలమూరులో టీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు స్కెచ్

  పలువురు నేతలతో భేటీ అయిన విషయం వాస్తవమేనని రేవంత్ రెడ్డి అనుచరులు కూడా చెబుతున్నారని తెలుస్తోంది. ఒక్కరొక్కరు రేవంత్ వద్దకు రావడం ఖాయమంటున్నారు. మిగతా జిల్లాల్లోను పెద్ద ఎత్తున తన వద్దకు రప్పించుకోవడంతో పాటు తన సొంత జిల్లాలో టీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది.

   కంగుతున్న టీఆర్ఎస్ శ్రేణులు, అప్పుడే ఆందోళన

  కంగుతున్న టీఆర్ఎస్ శ్రేణులు, అప్పుడే ఆందోళన

  హన్వాడ జడ్పీటిసి తెరాసకు గుడ్‌బై చెప్పడంతో జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు షాకయ్యాయి. జిల్లాలో రేవంత్ వెంట ఎంతమంది క్యూకడతారోననే ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో అప్పుడే మొదలైంది.

   కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు భారీ ప్రణాళిక, సంప్రదింపులు

  కేసీఆర్‌ను దెబ్బతీసేందుకు భారీ ప్రణాళిక, సంప్రదింపులు

  రేవంత్ మాత్రం క్షేత్ర స్థాయిలో తెరాసకు చెందిన వారిని తమ వెంట తీసుకెళ్లేందుకు భారీ ప్రణాళికలే రచించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన వ్యూహాలను అమలు పరిచేందుకు రేవంత్‌కునమ్మిన వ్యక్తులుగా ముద్రపడ్డ కొందరు పాలమూరు జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ఎంపిపిలతో సంప్రందిపులు జరుపుతున్నారు.

   వారి చేరికలు దాదాపు ఖరారు

  వారి చేరికలు దాదాపు ఖరారు

  ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు జడ్పీటిసిలు, నలుగురు ఎంపిపిలు రేవంత్ వెంట వెళ్లేందుకు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. వారి చేరికలు కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.

   టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్

  టీఆర్ఎస్ నేతల సస్పెన్షన్

  హైదరాబాద్‌లో రేవంత్ ఇంటి దగ్గర జరిగిన సమావేశానికి మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సురేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి రేవంత్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో జడ్పీటిసి నారాయణమ్మ, ఆమె తనయుడు సురేంద్ రెడ్డిలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని సోమవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ ప్రకటించారు. తామే రాజీనామా చేసినప్పడు వారు తమను సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని సురేంద్ రెడ్డి అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy affect, Big Shock to KCR

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి