దేవాన్ష్‌కు రేవంత్ రెడ్డి 'అమరావతి' కండువా, ప్రశ్నించిన భువనేశ్వరి

అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం నాడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా... నారా లోకేష్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్‌కు అమరావతి కండువా కప్పారు.

తెలుగుదేశం పార్టీ కండువా వేయాలి కదా.. అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. దానికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ... ఆ పనిని దేవాన్ష్ తాత నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారని సరదాగా వ్యాఖ్యానించారు.

Photos: అమరావతి శంకుస్థాపన

వంటకాలు సిద్ధం

Revanth Reddy Amaravati Kanduva to Devansh

అమరావతికి తరలి వచ్చిన అతిథులకు నోరూరించే వంటకాలు సిద్ధమయ్యాయి. మొత్తం మూడు కేటగిరీలుగా మెనూను సిద్ధం చేశారు. అతిథులకు పూర్తిగా ఆంధ్ర వంటకాలను రెడీ చేశారు. లక్షన్నర మందికి సరిపడా వంటకాలు అమరావతి శంకుస్థాపన వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి.

వీవీఐపీలకు శంకుస్థాపన జరిగే ప్రాంతంలోనే విందు ఏర్పాట్లు చేశారు. వీరికోసం గ్రీన్ సలాడ్, మొలకెత్తిన గింజలు, లెమన్ జ్యూస్, మొక్క జొన్న సలాడ్ అందుబాటులో ఉన్నాయి. భోజనంలోకి కొత్త ఆవకాయ, గోంగూర, వంకాయ పచ్చిపులుసు, కొబ్బరి చట్నీ, పచ్చి జామకాయ చట్నీ, కరివేపాకు కారం, కొబ్బరి శనగ కారం, మెంతి మజ్జిగ, రసం, అప్పడాలు, జిలేబీ, నేతి బొబ్బట్లు, రెడీగా ఉన్నాయి.

Revanth Reddy Amaravati Kanduva to Devansh

వీటితో పాటు రకరకాల కిళ్లీలు, నాలుగు రకాల ఐస్ క్రీమ్ లు ఉన్నాయి. వీవీఐపీలకు వేదికపైనే డ్రైఫ్రూట్స్ కార్న్ సమోసా, ఫ్రూట్ జ్యూస్, పూర్ణం అందిస్తారు.

వీఐపీలకు 100 గ్రాముల చక్రపొంగలి, 150 గ్రాముల పులిహోర, ఒక గారె, ఒక పూర్ణం బూరె, ఒక ఫ్రూటీ, ఒక మంచినీళ్ల సీసా ఇస్తారు. రైతులు, సాధారణ ప్రజలకు 75 గ్రాముల చక్రపొంగలి, 150 గ్రాముల పులిహోర, 150 గ్రాముల దద్దోజనం, ఒక తాపేశ్వర కాజా, ఒక అరటిపండు, రెండు మంచినీళ్ల సీసాలు ఇస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+