హరీష్‌వి అబద్ధాలు: రేవంత్, రెడ్లను అణచేందుకే రేవంత్‌పై కేసులంటూ సర్వే
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో గెలవడానికి రాష్ట్ర మంత్రి హరీష్ రావు అబద్దాల ప్రచారానికి తెర తీసారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈఎన్‌సీ మురళీధర్‌రావు రాసిన లేఖ ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేశారని, కాగా మురళీధర్‌రావు హరీష్‌రావు బంధువేనని రేవంత్‌రెడ్డి అన్నారు.
అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మావోయిస్టులనే ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. అలాగే విజయ్‌కు ఏదైనా జరిగితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, వరంగల్‌లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించకపోతే కేసీఆర్ అరాచకాలకు ఆమోద ముద్రవేసినట్టేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రెడ్డి సామాజికవర్గాన్ని అణచివేసేందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కాంగ్రెసు నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డిను విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని ఆయన అన్నారు. కేసీఆర్‌కు కరపత్రంగా పనిచేస్తున్న నమస్తే తెలంగాణపై పరువునష్టం దావా వేస్తామని సర్వే చెప్పారు.
టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కవితకు కేంద్రమంత్రి పదవి కోసమే కేసీఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి కడియం శ్రీహరి మాదిగ కాదని చెప్పడం మాదిగలను అవమానించడమేనని చెప్పారు. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని సర్వే మండిపడ్డారు. హరీశ్‌రావును పక్కనబెట్టడం కాంగ్రెస్‌కే అనుకూలమని సర్వే చెప్పారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications