• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చట్టానికి లోబడే రేవంత్ రెడ్డి అరెస్ట్.. హైకోర్టులో కౌంటర్ పిటిషన్

|

హైదరాబాద్‌ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది. అర్ధరాత్రి రేవంత్ ను అరెస్ట్ చేయడమేంటనే వాదనలు వినిపించాయి. ఆక్రమంలో హైకోర్టు కూడా ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టడంతో పాటు డీజీపీ నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా సోమవారం కౌంటర్ దాఖలు చేశారు వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ.

రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు కోర్టుకు వివరించారు అన్నపూర్ణ. సీఎం కేసీఆర్ సభను అడ్డకుంటామన్న రేవంత్ వ్యాఖ్యలతో తాము అలర్ట్ అయ్యామే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. అందుచేత వారు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేయండని కోరారు.

అంతా చట్టప్రకారమే.. కౌంటర్ పిటిషన్

అంతా చట్టప్రకారమే.. కౌంటర్ పిటిషన్

డిసెంబర్ 4న కొడంగల్ లో సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ కు కేసీఆర్ రానివ్వబోమంటూ హెచ్చరించారు. దీంతో డిసెంబర్ 3 అర్ధరాత్రి అనూహ్యంగా రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి రేవంత్ ను అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ లీడర్ వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల సంఘాన్ని వివరణ కోరుతూ ఆదేశాలు జారీచేసింది న్యాయస్థానం. అంతేకాదు డీజీపీ నేరుగా హాజరుకావాలంటూ ఆర్డరేసింది. ఈక్రమంలో సోమవారం (17.12.2018) మరోసారి దీనిపై విచారణ జరిపింది. అయితే నేర విచారణ చట్టం కింద ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేసినట్లు కోర్టుకు వివరించారు వికారాబాద్ మాజీ ఎస్పీ అన్నపూర్ణ. సీఎం సభ కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రేవంత్ సహకరించలేదు.. అందుకే..!

రేవంత్ సహకరించలేదు.. అందుకే..!

రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా ఆరోజు జరిగిన పరిణామాలను కోర్టుకు క్షుణ్ణంగా వివరించారు అన్నపూర్ణ. రేవంత్ రెడ్డి బయటకు రావాలని వారికి వినిపించేలా మైకుల ద్వారా చెప్పినా కూడా ఎవరూ రాలేదని చెప్పారు. దీంతో గేట్ తాళాలు పగలగొట్టాల్సి వచ్చిందని తెలిపారు. లోపలికి వెళ్లిన తర్వాత రేవంత్ ఉన్న గది దగ్గరకు వెళ్లి తలుపులు తీయాలని కోరినా స్పందించలేదని.. కొంచెం గట్టిగా నెట్టడంతో బోల్టు ఊడిపోయి తలుపులు తెరుచుకున్నాయని కోర్టుకు విన్నవించారు. అయితే రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్ సమాచారం ఆయన భార్య గీతకు తెలియజేసినా వారు స్పందించలేదని వివరించారు.

అంతకముందు కూడా రేవంత్ రెడ్డి అనేకసార్లు నిబంధనలు ఉల్లంఘించారని.. అనుమతులు లేకుండానే ర్యాలీలు నిర్వహించారని కోర్టుకు తెలిపారు అన్నపూర్ణ. ఈమేరకు అనేక కేసులు కూడా నమోదయినట్లు వివరించారు. ఎన్నికల వేళ ఆయన అనుచరుల ఇళ్లల్లో నగదు నిల్వలున్నాయన్న సమాచారంతో దాడులకు వెళితే అడ్డుకున్నారని ఆరోపించారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించారని కోర్టుకు తెలిపారు. ఆనేపథ్యంలో సీఎం సభను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే ముందస్తు అరెస్ట్ చేశామని వివరించారు.

శాంతిభద్రతలకు భంగం కలగకుండా..! చట్టప్రకారమే అరెస్ట్

శాంతిభద్రతలకు భంగం కలగకుండా..! చట్టప్రకారమే అరెస్ట్

శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశామే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. నేరవిచారణ చట్టం సెక్షన్ 151 ప్రకారమే ముందస్తు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అటు సీఎం సభ అయిపోగానే రేవంత్ ను విడిచిపెట్టామని వివరించారు. అనంతరం ఆయన బొంరాస్ పేట మండలంలో రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించుకున్నారని తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా తాము చట్టప్రకారమే వ్యవహరించామని.. తాము చెప్పిన అంశాలు పరిగణనలోకి తీసుకుని హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేయాలని కౌంటర్ పిటిషన్ లో కోరారు అన్నపూర్ణ. అదలావుంటే ఆమె కౌంటర్ పై రిప్లై దాఖలు చేయడానికి రేవంత్ తరపు లాయర్ గడువు కోరడంతో గురువారానికి విచారణ వాయిదా వేసింది ధర్మాసనం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vikarabad Ex SP Annapurna explained To the Highcourt that there is no conspirancy in revanth reddy arrest. The decision was taken without any disruption of law and order from the Chief Minister's public Meeting at kodangal. She explained also that After CM sabha, revanth reddy has been released. Annapurna has filed a Counter petition to dismiss the Habeus Corpus petition to take into consideration the issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more