వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కేసు: చంద్రబాబుకు సన్నిహితుడైన ఎంపి ఖాతా నుంచి రూ. కోటి డ్రా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు తీవ్రమైన కసరత్తు చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముట్టజెప్పడానికి రేవంత్ తెచ్చిన రూ.50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి డ్రా చేశారనే విషయంపై ఎసిబి అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇతర కీలక సమాచారాన్ని కూడా ఎసిబి అధికారులు రాబడుతున్నారు.

రేవంత్‌ అరెస్ట్‌ సమయంలో స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలపై బ్యాంకు లేబుల్స్‌ లేవు. నోట్లపై ఉన్న నెంబర్ల ఆధారంగా ఆ నగదును ఓ చిన్నపాటి ప్రైవేటు బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు గుర్తించారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ ఖాతా నుంచి రూ.కోటి డ్రా చేసినట్లు ఎసిబి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు వారు కొనసాగిస్తున్నారు.

రేవంత్ రెడ్డి అరెస్ట్‌ సమయంలో దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలతోపాటు ఓటింగ్‌ అనంతరం నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మిగిలిన రూ.4.5 కోట్లపైనా ప్రధానంగా దృష్టిసారించారు. స్టీఫెన్‌సన్‌కు చెల్లించాల్సిన మిగిలిన మొత్తాన్ని వివిధ కార్పొరేట్‌ సంస్థలు హవాలా మార్గంలో సిద్ధం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

 Revanth Reddy case: Rs one crore drwan from an MP account

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలో తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ మధ్యవర్తుల సహకారంతో స్టీఫెన్‌సన్‌తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. కస్టడీలో సేకరించినసమాచారం మేరకు ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కూడా విచారించేందుకు ఎసిబి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

బాస్‌ అనే పదాన్ని ఎవర్ని ఉద్దేశించి రేవంత్ అన్నారనే విషయంపై కూడా కస్టడీలో విచారించిన సమయంలో రేవంత్‌ రెడ్డి నుంచి సమాధానం రాబట్టలేకపోయారు. అయితే ఇదివరకు పలు సభలు, సమావేశాలు, ఇతర సందర్భాల్లో రేవంత్‌ ఎవర్ని ఉద్దేశించి బాస్‌ అని మాట్లాడారో ఆ వీడియోలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సోదాల్లో లభించిన ఆధారాలు, సెల్‌ ఫోన్‌ కాల్‌ డేటా ద్వారా లభించిన సమాచారంపై కేసును చట్టప్రకారం ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ఎసిబి అధికారులు కసరత్తు చేశారు.

ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన సమాచారం ప్రకారం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే కొంతమంది మంత్రులు, ఇతరుల పేర్లను అదనపు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేందుకు ఎసిబి కసరత్తు చేస్తోంది. న్యాయనిపుణుల సూచనలు, సలహాల మేరకు కేసుకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు.

English summary
It is said that ACB has identified the source of money offered to Anglo Indian MLA Stephenson by Telangana Telugudesam party MLA Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X